Newsminute24

Janasena: వైసీపీకి జనసేన కౌంటర్..”ఇప్పటికిప్పుడైన సంతోషంగా దిగిపోతా ” కార్టూన్ వైరల్..!

Janasenacartoon:ఏపీ సీఎం జగన్ పై జనసేన రూపొందించిన కార్టూన్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఇటీవల  నేషనల్ ఛానల్ ‘ఇండియా టుడే ‘ నిర్వహించిన  ఎడ్యుకేషన్ సమ్మిట్ లో జగన్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ప్రోగ్రాంలో భాగంగా కన్సల్టింగ్ ఎడిటర్  అడిగిన ప్రశ్నలకు ఆయన ఆసక్తికర సమాధానం ఇచ్చారు. దీంతో దేశ వ్యాప్తంగా  జగన్ వ్యాఖ్యలపై సర్వత్రా చర్చ జరిగింది. తాజాగా జగన్ చేసిన వ్యాఖ్యలను కోట్ చేస్తూ జనసేన సెటైరికల్ కార్టూన్ డిజైన్ చేసింది. 

ఇక కార్టూన్ పరిశీలించినట్లయితే..  ఏపీ అసెంబ్లీ ఎన్నికలు2024 కి సంబంధించి ‘ సిద్దం ‘ స్లోగన్ తో జగన్ అట్టహాసంగా ప్రచారం మొదలెట్టారు. అదే పేరును  టైటిల్ గా పెట్టీ.. జగన్ ఫోటోతో  ” ఇంటికి వెళ్లడానికేనా ” క్యాప్షన్ తో జనసేన కార్టూన్ రూపొందించింది. అంతేకాకుండా ఇండియా టుడే సమ్మిట్ లో ” అధికారంలో నుంచి ఇప్పటికిప్పుడైన సంతోషంగా దిగిపోతా ”  జగన్ కామెంట్స్ ను జత చేసింది. దీంతో ఈ కార్టూన్ పై జన సైనికులు, టీడీపీ అభిమానులు ఇష్టానుసారం కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.

 

Exit mobile version