పవర్ స్టార్ బర్త్ డే.. జల్సా రీరిలీజ్.. ఫ్యాన్స్ హంగామా..!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా బ్లాక్ బస్టర్ మూవీ జల్సా రీ రీలీజ్ అంతా సిద్ధమైంది. దాదాపు 500 షోస్ తో సెప్టెంబర్ 2న చిత్రం విడుదల చేయనున్నారు. ఇందులో భాగంగానే చిత్ర ట్రైలర్ ను సుప్రీంహీరో సాయిధరమ్ తేజ్ చేతుల మీదుగా విడుదల చేశారు. ఇప్పటి ట్రెండ్ కి తగ్గట్టుగా కట్ చేసిన ట్రైలర్ అభిమానులు ఆకట్టుకుంటోంది. సూపర్ స్టార్ మహేష్ బాబు వాయిస్ ఓవర్ అనుగుణంగా  సన్నివేశాలను కట్ చేసిన తీరు అమోఘమని చెప్పవచ్చు. ఇప్పటికే అంతంటా అడ్వాన్స్ బుకింగ్స్ పూర్తవడంతో కొన్ని చోట్ల హౌస్ ఫుల్ బోర్డ్స్ దర్శనమిస్తున్నాయి.

ఇక మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వం వహించిన ..ఈచిత్రానికి రాక్ స్టార్ దేవిశ్రీప్రసాద్ మ్యూజిక్ అందించిన విషయం తెలిసిందే. పవన్ సరసన్ ఇలియానా, పార్వతి మెల్టన్ హీరోయిన్లు నటించారు. 2008లో విడుదలైన ఈమూవీ అప్పట్లో టాలీవుడ్ రికార్డులను తిరగారాసింది. పవర్ స్టార్ కెరీర్ లో అత్యధిక కలెక్షన్లు వసూలు చేసిన చిత్రంగా నిలిచింది.మరోమారు చిత్రం థియేటర్లలోకి వస్తుండటంతో పవన్ అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

కాగా జల్సా తోపాటు కొన్ని చోట్ల తమ్ముడు చిత్రాన్ని విడుదల చేస్తున్నారు. సినిమా వచ్చి పదేళ్లు అయినా ఏమాత్రం క్రేజ్ తగ్గలే డైలాగ్ తరహాలో థియేటర్ల దగ్గర అభిమానుల సందండి కనిపిస్తోంది. భారీ కటౌట్లు, బాణాసంచాలతో పండగ వాతావరణం కనిపిస్తోంది. బాక్స్ ఫీస్ కా బాప్ అంటూ పవర్ స్టార్ స్లోగన్స్ తో సోషల్ మీడియాలో కామెంట్స్ తో రెచ్చిపోతున్నారు.

Optimized by Optimole