Raju:
===========
బిగ్‌బాస్ సీజన్ 6 గురువారం ఆసక్తికరంగా సాగింది. హౌస్ కెప్టెన్ గా రేవంత్ కొనసాగుతున్న సంగతి తెలిసిందే. అయితే ఈసారి నామినేషన్స్‌లో అతడికి గట్టిగానే ఓట్లు పడేట్లు కనిపిస్తోంది. ఎందుకంటే బ్యాటరీ రీచార్జ్ టాస్క్ నడుస్తున్న సమయంలో అందరూ హౌస్ నియమాలు పాటించాలని బిగ్‌బాస్ స్పష్టంగా చెప్పాడు. సభ్యులు అంతా రూల్స్ పాటించేలా చేయాల్సిన కెప్టెన్ రెండు సార్లు నిద్రపోయి.. బ్యాటరీ తగ్గిపోవడానికి ప్రధాన కారణమైయ్యాడు. దీంతో అతడికి నామినేషన్స్‌లో గట్టిగానే ఓట్లు పడేట్లు కనిపిస్తోంది.
టాస్క్ ఆఖరిలో రాజశేఖర్ (రాజ్) మొత్తం బ్యాటరీని ఉపయోగించడంతో మెరీనా-రోహిత్‌లకు ఎలాంటి సర్‌ప్రైజ్ అందకుండా పోయినట్లు తెలుస్తోంది. మరోవైపు ఇనయ-ఆర్జే సూర్య హద్దులుదాటరు. ఏదో కొత్తగా పెళ్లైన జంటలా ఉంది వీళ్ల వ్యవహారం. ఇంట్లో ఏ మూల చూసినా వీళ్లిద్దరే ఎక్కువగా కనిపిస్తున్నారు. ఇద్దరూ పక్క పక్కనే కూర్చుంటున్నారు.. లేదంటే పడుకుంటున్నారు.
https://www.youtube.com/watch?v=jbIIFSP6NX0
ఇనయ ఒళ్లో ఇతని తల పెట్టి పడుకోవడం.. సూర్య ఒళ్లో ఆమె తల పెట్టి ఉంటుంది. బిగ్ బాస్ ఐదో సీజన్‌లో సిరి-షణ్ముఖ్‌ల మాదిరిగా వీరిద్దరూ కూడా రెచ్చిపోయారు. వీళ్లు ఇంట్లో ఎవరికి కనిపించకుండా లోలీపప్‌లు తింటూ వేసిన వేషాలు అబ్బో చండాలం. ఒకరి నోట్లో ఒకరు లోలీపప్ పెట్టి తినిపించుకుంటూ సీన్స్ వేరే లెవల్ లోకి వెళ్లింది. ఆన్ సీన్ ఎపిసోడ్స్ లో వీళ్ల రాసలీలకు సంబంధించి వీడియో బయటకు వచ్చింది. కెమెరాలు ఉన్నాయి. జనం చూస్తున్నారు అనే యావే లేకుండా ఇనయ- సూర్య రెచ్చి పోయిన తీరు చూస్తే.. పార్కుల్లో లవర్స్ బెటర్ అనేలా చేస్తున్నారు. ఈ ఎపిసోడ్ చూస్తే షోపై సీపీఐ నారాయణ చేసిన కామెంట్స్ నిజమేమో అనిపించేలా ఉంటాయి.