Telanganacongress: తెలంగాణ ఆర్టీసీ నీ ప్రభుత్వంలో విలీనం చేయడం ఎన్నికల స్టంట్అ గా అభివర్ణంచారు టీపీసీసీ ప్రధాన కార్యదర్శి పట్లోళ్ళ రఘువీర్ రెడ్డి. గత 9 సంవత్సరాలుగా గుర్తు రాని ఆర్టీసీ కార్మికులు ఇప్పుడు గుర్తొచ్చారా కేసిఆర్ అంటూ ఆయన నిలదేశారు. ఆర్టీసీకి ఉన్న వేలాది కోట్ల ఆస్తులను వీలినం చేయడం కోసం ఈ నాటకానికి తెరదీశారని ఆరోపించారు. ఆర్టీసి ఉద్యోగులకు బాకీ ఉన్న 2013 ఎరియర్స్ .. రెండు పీఅర్సీ లతో పాటు ప్రభుత్వం లో విలీనం చేయాలని అదే విధంగా గత పది సంవత్సరాలుగా పొరుగు సేవల్లో ఉన్న ఉద్యోగులను కూడా గుర్తించాలని రఘువీర్ రెడ్డి డిమాండ్ చేశారు.