ఆస్తుల కోసమే ఆర్టీసి వీలినం : పట్లోళ్ళ రఘువీర్ రెడ్డి

Telanganacongress:  తెలంగాణ  ఆర్టీసీ నీ ప్రభుత్వంలో విలీనం చేయడం ఎన్నికల  స్టంట్అ గా అభివర్ణంచారు టీపీసీసీ ప్రధాన కార్యదర్శి పట్లోళ్ళ రఘువీర్ రెడ్డి.  గత 9 సంవత్సరాలుగా గుర్తు రాని ఆర్టీసీ కార్మికులు ఇప్పుడు గుర్తొచ్చారా కేసిఆర్ అంటూ ఆయన నిలదేశారు.  ఆర్టీసీకి ఉన్న వేలాది కోట్ల ఆస్తులను వీలినం చేయడం కోసం ఈ నాటకానికి తెరదీశారని ఆరోపించారు. ఆర్టీసి ఉద్యోగులకు బాకీ ఉన్న 2013 ఎరియర్స్ .. రెండు పీఅర్సీ లతో పాటు ప్రభుత్వం లో విలీనం చేయాలని అదే విధంగా గత పది సంవత్సరాలుగా పొరుగు సేవల్లో ఉన్న ఉద్యోగులను కూడా గుర్తించాలని  రఘువీర్ రెడ్డి డిమాండ్ చేశారు.

కాగా 2019 లో తమ డిమాండ్ ల కోసం సమ్మెలో కార్మికులు చనిపోతే కూడా పటించుకొని ముఖ్యమంత్రి కి ఇప్పుడు అకస్మాత్తుగా ఆర్టీసీ కార్మికులు గుర్తుకురావడం విడ్డూరంగా ఉందన్నారు రఘువీర్. కేసిఆర్ కల్లబొల్లి మాటలకు కాలం చెల్లిందని.. రానున్న అసెంబ్లీ  ఎన్నికల్లో  ప్రజలు తగిన గుణపాఠం చెబుతారని హెచ్చరించారు. బీఆర్ఎస్ ప్రభుత్వం ఎన్ని జిమ్ముకులు చేసిన ఆర్టీసీ కార్మికులు నమ్మే పరిస్థితుల్లో లేరని రఘువీర్ తేల్చిచెప్పారు.

 

Related Articles

Latest Articles

Optimized by Optimole