Newsminute24

వచ్చే ఎన్నికల్లో గెలుపు నాదే: సంకినేని వెంకటేశ్వర్ రావు

సూర్యాపేట: వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో సూర్యాపేటలో విజయం తనదేనని ధీమా వ్యక్తంచేశారు బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు సంకినేని వెంకటేశ్వర్ రావు.రెండుసార్లు ఓటమి పాలైన నిత్యం ప్రజాక్షేత్రంలో ఉంటూ.. ప్రజా సమస్యలపై పోరాడుతున్నానని  తెలిపారు. తన వెంట ఉన్న నాయకులందరినీ అధికార పార్టీ డబ్బులతో లొంగదీసుకున్నా.. నమ్ముకున్న కార్యకర్తల కోసం రాజకీయాల్లో కొనసాగుతున్నట్లు స్పష్టం చేశారు. 2014లో పార్టీ టికెట్ రాకున్నా స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తే.. నియోజక వర్గ ప్రజలు చూపించిన ఆదరణను  మర్చిపోలేదని సంకినేని గుర్తు చేసుకున్నారు.

ఇక తెలంగాణలో టిఆర్ఎస్ అవినీతిని ఎండగడుతూ బిజెపి రాష్ట్రస్థాయిలో ఉద్యమిస్తుందన్నారు సంకినేని. పార్టీ అధ్యక్షుడు బండి సంజయ్.. రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్రలు చేస్తూ అవినీతిపై పోరాడుతున్నారని పేర్కొన్నారు. రానున్న ఎన్నికల్లో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం ఖాయమని కుండ బద్దలు కొట్టారు.

ఇదిలా ఉంటే.. సూర్యాపేటలో జరుగుతున్న అవినీతిపై పోరాటంలో తనతో పాటు  అనేక మందిపై కేసులు పెట్టారని వాపోయారు సంకినేని. తన కుమారుడు సంకినేని వరణ్ పై హత్యాయత్నం కేసు పెట్టే ప్రయత్నం చేశారన్నారు. కారు అద్దాలు ధ్వంసం చేసి..ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టారన్నారు.అంతేకాక తన చుట్టూ ఉన్న నాయకులపై అక్రమ కేసులు పెట్టి జైల్లో ఉంచడం జరిగిందన్నారు. ఇంత జరిగినా.. మంత్రి చేస్తున్న అవినీతిపై పోరాటంలో వెనక్కు తగ్గే ప్రసక్తే లేదన్నారు. ఎల్లవేళలా ప్రజల ఆశీస్సులు తనకు ఉన్నాయని సంకినేని వెల్లడించారు.

 

Exit mobile version