Sambasiva Rao:
================
బడిలో విద్యార్థుల ప్రతిభ వెలికి తీయడానికి పోటీ పరీక్షలు నిర్వహిస్తారు. ఒక్కొక్క సబ్జెక్ట్ ఆధారంగా పరీక్షలు పెడుతుంటారు. పిల్లలకు వ్యాస రచన, జనరల్ నాలెడ్జ్ వంటి పోటీలు ఉంటాయి. అయితే పరీక్షలో కొందరూ విద్యార్థులు రాసే జవాబులు చాలా చిత్రంగా ఉంటాయి. ఒక్కొక్కసారి వారు రాసే సమాధానాలు నవ్వులు తెప్పిస్తుంటాయి. అవి సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతుంటాయి. అలా ఓ విద్యార్థి పెళ్లి గురించి రాసిన సమాధానం నవ్వు తెప్పిస్తోంది.
ఓ పాఠశాలలో నిర్వహించిన పరీక్షల్లో పెళ్లి అంటే ఏంటో రాయాలని అడిగారు. ప్రశ్నకి పది మార్కులు కేటాయించాడు. అయితే పెళ్లిపై బాలుడి రాసిన సమాధానం నెటిజన్లకు నవ్వుతెప్పిస్తోంది. అందులో ఏముందంటే.. ‘పెళ్లిడికి వచ్చిన యువతికి కుటుంబ సభ్యులు పెద్దదానివి అయ్యావంటూ.. తిండి పెట్టలేం అని.. నీకు తిండి పెట్టే వ్యక్తికి వెతుక్కోవాలని చెప్పారటంట. దీంతో ఆ యువతి తిండి పెట్టి పోషించే వ్యక్తిని వెతికి పనిలో ఉంటుందంట.
మరోవైపు నువ్వు పెద్దవాడివి అయ్యావు, పెళ్లి చేసుకో అంటూ అబ్బాయికి కూడా వాళ్ల తల్లిదండ్రులు చెబుతుంటారు. పెళ్లి చేసుకోవాల్సిన అబ్బాయిని యువతి కలుసుకుంటుందట. వాళ్లిద్దరూ ఇద్దరు కలిసి జీవించడానికి అంగీకరిస్తారు. వివాహం తర్వాత వారు పిల్లలన్ని కనడానికి తప్పుడు పనులు చేయడం ప్రారంభిస్తారు’ అని విద్యార్థి రాసుకొచ్చాడు. దాంతో ఆ విద్యార్థి రాసిన జవాబు షీట్‌ను సోషల్ మీడియాలోషేర్ చేశారు.
విద్యార్థి జవాబుకి ఖంగు తిన్న టీచర్ సున్నా మర్కులేసినట్లు కనిపిస్తుంది. అంతే కాదు నాన్ సెన్స్ అని రాసి కొట్టేశారు. దీనిని చూసిన నెటిజన్లు రకరకాల కామెంట్స్ చేస్తున్నారు.