Newsminute24

నరేంద్రమోదీని కావిలించుకోడానికి రాహుల్ కి మరో ఛాన్స్ ఇచ్చిన సుప్రీంకోర్టు..

Nancharaiah merugumala (political analyst):నరేంద్రమోదీని పార్లమెంటులో కావిలించుకోడానికి రాహుల్ గాంధీకి మరో ఛాన్స్ ఇచ్చిన సుప్రీంకోర్టు

త్వరలో అవిశ్వాస తీర్మానంపై చర్చ ముగిసే సందర్భంలో.. లోక్ సభలో ప్రధానమంత్రి నరేంద్రమోదీని మరోసారి ఆలింగనం చేసుకునే అవకాశాన్ని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీజీకి శుక్రవారం భారత సుప్రీంకోర్టు ఇచ్చింది. వాయనాడ్ ఎంపీకి రెండేళ్ల జైలు శిక్ష విధించిన సూరత్ చిన్న కోర్టు తీర్పు అమలుపై సర్వోన్నత న్యాయస్థానం స్టే ఇవ్వడంతో మోదీతో పార్లమెంటు దిగువసభలో ‘కలబడే’ గొప్ప ఛాన్స్ పండిత నెహ్రూ మునిమనవడికి లభించింది. కింది కోర్టు రాహుల్ ను దోషిగా తేల్చి ఇచ్చిన తీర్పుపై సుప్రీంకోర్టు స్టేతో ఆయన ‘అనర్హత’ ఆటోమేటిక్ గా రద్దయిపోతుంది. పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో పాల్గొనే వీలు రాహులుకు వస్తుంది. ఐదేళ్ల క్రితం అవిశ్వాస తీర్మానం ప్రక్రియ ముగిసే సమయంలో 2018 జులై చివర్లో లోక్ సభలో ప్రధాని స్థానం దెగ్గిరికి పోయి- కూసుని ఉన్న నరేంద్రమోదీని అమాంతంగా కావిలించుకున్నారు రాహుల్ భయ్యా. మోదీతో హఠాత్ ఆలింగనం ముగిసే లోపే  నాటి 48 ఏళ్ల కాంగ్రెస్ యువనేత ‘కన్నుగీత’ భారత పార్లమెంటరీ ప్రజాస్వామ్య చరిత్రలో శాశ్వత స్థానం సంపాదించుకుంది. కిందటిసారి అవిశ్వాస తీర్మానం బెజవాడ ఎంపీ కేశినేని శ్రీనివాస్ ‘నానీ’ది. ఈసారి కాంగ్రెస్ అవిశ్వాసం అస్సాంలోని గువాహటి కాంగ్రెస్ ఎంపీ గౌరవ్ గొగోయ్ ప్రవేశపెట్టినది.

Exit mobile version