ఫూలే మహా శక్తివంతుడు :ఏపిసిసి అధ్యక్షులు గిడుగు రుద్రరాజు
విజయవాడ: మహాత్మా జ్యోతిబా ఫూలే గారు గొప్ప శక్తివంతుడని, సంఘ సంస్కర్త అని ఏపిసిసి అధ్యక్షులు గిడుగు రుద్రరాజు ఫూలే సేవలను కొనియాడారు. మంగళవారం ఆంధ్రరత్న భవన్ నందు ఫూలే జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన గిడుగు రుద్రరాజు మాట్లాడుతూ.. సంస్కర్తలలో గొప్ప సంస్కర్త జ్యోతిబా ఫూలే అని.. కులాల నిర్మూలన కోసం ఆయన తపించేవారని అన్నారు. ఆయన అనేక సామాజిక సేవా సంఘాలను, అనేక పత్రికలను నడిపేవారని, ఆయన…