కామారెడ్డిలో మరో లవ్ జిహాద్ ఘటన..ఆలస్యంగా వెలుగులోకి..
కామారెడ్డి జిల్లా బాన్సువాడ మండలంలో మరో లవ్ జిహాద్ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఓ ముస్లిం యువకుడు మాయ మాటలతో.. హిందూ అమ్మాయిని శారీరకంగా లోబర్చుకొని మోసం చేశాడు. దీంతో బాధితురాలికి న్యాయం చేయాలని హిందు సంఘాల ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. సంఘటన స్థలానికి చేరుకున్న స్ధానిక సీఐ హామీ మేరకు ధర్నా విరమించారు. ఇక వివరాల్లోకి వెళితే..బాన్సువాడ మండలం కేంద్రంలో గల ప్రభుత్వ ఆసుపత్రిలో షఫీ అనే యువకుడు ప్రయివేట్ అంబులెన్స్ నడుపుతున్నాడు. అదే…