మాఘ పురాణం – 16 వ అధ్యాయము
విద్యాధరపుత్రిక కథ : రాజా! మాఘమాసస్నాన మహిమను తెలుపు మరియొక కథను వినుమని, మరల యిట్లు పలికెను. పూర్వమొక విద్యాధరుడు, సంతానము కావలయునని, బ్రహ్మనుద్దేశించి, గంగాతీరమున, తపము చేయుచుండెను. నియమవంతుడై, భక్తి శ్రద్దలతో, చిరకాలము, తపమాచరించెను. అతడిట్లు, చిరకాలము తపము చేయ,గా బ్రహ్మ సంతుష్టుడై, వానికి ప్రత్యక్షమయ్యెను, వరములనిత్తును కోరుకొమ్మనెను. పుత్రునిమ్మని విద్యాధరుడు బ్రహ్మను కోరెను. అప్పుడు బ్రహ్మ “నాయనా! నీకు పుత్ర సంతానయోగము లేదు. అయినను నీ తపమునకు మెచ్చి, పుత్రిక ననుగ్రహించుచున్నానని” యంతర్దానమునందెను. ఆమె…