మహేశ్వరం నియోజకవర్గం అధికార టీఆర్ఎస్ లో కోల్డ్ వార్..!!
రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గం లో అధికార పార్టీలోని విభేదాలు రచ్చకెక్కాయి. మంత్రి సబితా ఇంద్రారెడ్డి భూకబ్జాలను ప్రోత్సహిస్తున్నారని.. ఆపార్టీనేత తీగల కృష్ణారెడ్డి బహిర్గతంగా ఆరోపణలు చేశారు. కొన్నాళ్లుగా అంతర్గతంగా కొనసాగుతున్న విభేదాలు తీగల తాజా వ్యాఖ్యలతో బహిర్గతమయ్యాయి. తమ ప్రాంతం కోసం అవసరమైతే ఆమరణ నిరాహారదీక్ష చేస్తానని తీగల ప్రకటించడం తీవ్ర చర్చనీయాంశమైంది. మహేశ్వరం నియోజకవర్గంలో మంత్రి సబితా, మాజీ ఎమ్మెల్యే తీగల కృష్టారెడ్డి వర్గాల మధ్య పచ్చిగడ్డి వేస్తే భగ్గుమనేలా పరిస్థితి తయారైంది. మీర్…