మరికొద్ది గంటల్లో మునుగోడు ఫలితం.. మారుతున్న ఎగ్జిట్ పోల్స్ రిపోర్ట్స్ ..
తెలంగాణా రాజకీయమంత మునుగోడు ఉప ఎన్నికపై కేంద్రీకృతమైంది. పోలింగ్ ముగియడంతో గెలుపుపై ప్రధాన పార్టీ నేతలు ‘ మేకపోతు గాంభీర్యం’ ప్రదర్శిస్తున్న లోలోపల మాత్రం మదనపడుతున్న పరిస్థితి కనిపిస్తోంది. ఫలితానికి మరి కొద్దీ గంటల సమయం ఉండటంతో సోషల్ మీడియాలో ఎగ్జిట్ పోల్ సర్వే కోలాహలం నడుస్తోంది. పోలింగ్ ముగియకముందే అధికార టీఆర్ఎస్ భజన మీడియా సంస్థలు.. ప్రతినిధులు.. ఎగ్జిట్ పోల్స్.. కారు పార్టీకి అనుకూలంగా రిపోర్టులు ఇవ్వడం.. ఉదరగొట్టే ప్రసంగాలతో హోరెత్తించాయి. దీంతో బీజేపీ తో…