మునుగోడు స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులకు సంజయ్ లేఖ.. ఇరకాటంలో టీఆర్ఎస్..!!
మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గంలోని స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులకు లేఖ ద్వారా బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ విజయదశమి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా స్థానిక ప్రజాప్రతినిధుల హక్కులను టీఆర్ఎస్ ప్రభుత్వం కాల రాస్తున్న విధానాన్ని ఎండగట్టారు. ప్రజల చేత ఎన్నుకోబడిన నేతలను కేసిఆర్ విస్మరిస్తున్న తీరుపై లేఖలో సంజయ్ ఆవేదన వ్యక్తం చేశారు. భారత రాజ్యాంగం 73, 74 అధికరణల ద్వారా స్థానిక సంస్థల ప్రతినిధులు పొందిన హక్కులను గురించి ప్రస్తావించారు. మహాత్మా గాంధి…