ఏపీలో ముందస్తు ఎన్నికలు వచ్చే అవకాశం: ఎంపీ రఘురామ
ఏపీ సీఎం జగన్ ముందస్తు ఎన్నికలకే వెళ్లాలని నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణం రాజు సూచించారు. తాజా రాజకీయ పరిస్థితులు చూస్తే.. అతి త్వరలోనే వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయన్నారు. ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చీలకుండా.. ప్రజాభిప్రాయం మేరకు ముందుకు వెళ్తామన్నారు. ప్రజల్లో ఇప్పటికే ఎంతో చైతన్యం వచ్చిందన్న ఆయన.. ప్రతిపక్ష నేత చంద్రబాబు సభలకు హాజరవుతున్న జనాలే అందుకు నిదర్శనమన్నారు . ప్రతిపక్ష పార్టీల ఓట్లు చీలకూడదని భావిస్తున్నా జనసేన అధినేత పవన్ కళ్యాణ్..చంద్రబాబులు.. ఎన్నికలు ఎప్పుడు జరిగినా …