Newsminute24

Telangana: తెలంగాణ హిట్లర్ వ్యాఖ్యలపై రచ్చ..!!

Telangana:

జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ప్రచారం వాడి వేడిగా సాగుతోంది.అధికార ,ప్రతిపక్ష నేతల మాటల తూటాలు పేలుతున్నాయి.తాజాగా కేటీఆర్ చేసిన తెలంగాణ హిట్లర్ వ్యాఖ్యలు రాజకీయంగా తీవ్ర దుమారం రేపుతున్నాయి. అటు కాంగ్రెస్ నేతలు ఈ వ్యాఖ్యలపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నారు. ‘హిట్లర్ నియంత పాలన’ గురించి మాట్లాడితే ఎవరికైనా మొదట గుర్తు వచ్చేది కేసీఆర్ ఆయన పదేళ్ల విధ్వంస పాలన. అందువల్లే ఆయన కాలగర్భంలో కలిసిపోయారని సంగతి మర్చిపోయి కేటీఆర్ మాట్లాడుతున్నారని ఘాటుగా కౌంటర్ ఇవ్వడంతో రాజకీయ రచ్చ మొదలైంది.

kcr sad news. kcr, kcr bad,

అటు తెలంగాణ హిట్లర్ వ్యాఖ్యలపై కాంగ్రెస్ నేతలు సోషల్ మీడియా వేదికగా కేటీఆర్ ను ఏకి పారేస్తున్నారు. ఉద్యమ సమయంలో అందరిని కలుపుకుపోయిన కేసీఆర్, ముఖ్యమంత్రి అయ్యాక అందరినీ పక్కన పెట్టీ పదేళ్లు నియంతలా పాలించిన విషయం మర్చిపోయావా కేటీఆర్? ప్రశ్నించే గొంతు వినపడకూడదన్నట్లు ప్రతిపక్షాలను బలహీనపరిచి నిర్వీర్యం చేసింది మీ తండ్రి కేసిఆర్ కాదా? తెలంగాణలో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసింది మీరు కాదా?తమను అధికారానికి దూరం చేశారని సీఎం రేవంత్ రెడ్డి పై అక్కసు తో విమర్శించాలని,హిట్లర్ నియంత పాలన గురించి నువ్వు మాట్లాడుతుంటే హాస్యాస్పదంగా ఉంది? తెలంగాణ ప్రజల గాయాలను మళ్ళీ కెలికి గుర్తు చేస్తే మీకు శంకర గిరి మాన్యాలే  అంటూ సెటైర్లతో హెచ్చరిస్తున్నారు.

Exit mobile version