Newsminute24

Telangana: కవిత లేఖ విచిత్రం – బీసీలపై మాట్లాడే అర్హత కవితకు లేదు: టిపీసీసీ చీఫ్

హైదరాబాద్: బిఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఏఐసీసీ అధ్యక్షులు మల్లిఖార్జున్ ఖర్గేకు లేఖ రాయండపై టిపీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ ఘాటుగా స్పందించారు. బీసీల గురించి ఆమె లేఖ రాయడం నవ్వి పొదురు గాక నాకేమి సిగ్గు మాదిరి ఉందన్న ఆయన..ఆమె జాగృతి తరపున రాశారా? లేక బీఆర్‌ఎస్ తరపునా? స్పష్టత లేకపోవడం విచిత్రంగా ఉందన్నారు.”పదేళ్ల పాటు అధికారంలో ఉన్న బీఆర్‌ఎస్ ప్రభుత్వం బీసీల కోసం ఏం చేసిందో చెప్పాలని డిమాండ్ చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్లు తగ్గించింది ఎవరు? కేసీఆర్ కాదా? ఈ పదేళ్లలో కవితగారు బీసీల గురించీ మాట్లాడినట్లయితే ఒక్క క్లిప్పింగ్ అయినా చూపించగలరా? అని సవాల్ విసిరారు. రాజకీయ శూన్యంలో ఆమె రాజకీయంగా మనుగడ కోసం బీసీ జపం చేస్తున్నారని.. బీసీలపై మాట్లాడటానికి ఆమెకు అర్హతే లేదన్నారు. బీసీ డిక్లరేషన్ ప్రకటించిన సమయంలో కవిత లిక్కర్ స్కాంలో జైలు ఊచలు లెక్కపెడుతున్నారని టీపిసిసి చీఫ్ విమర్శించారు.

ఇక రేపు లాల్ బహదూర్ స్టేడియంలో జరగనున్న కాంగ్రెస్ పార్టీ గ్రామ అధ్యక్షుల సమ్మేళనంను “సామాజిక న్యాయ సమర భేరి” సభగా అభివర్ణించారు. ఈ సభకి గ్రామ, మండల, జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులతో పాటు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, కార్పొరేషన్ చైర్మన్లు కలిపి సుమారు 40 వేల మంది పాల్గొంటారని మహేష్ గారు వెల్లడించారు. సభకు ముఖ్య అతిథిగా ఖర్గే గారు హాజరై, గ్రామ అధ్యక్షులకు దిశానిర్దేశం చేయనున్నారు.

Exit mobile version