Site icon Newsminute24

Hyderabad: లాల్ దర్వాజా అమ్మవారిని దర్శించుకున్న టిపిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్…

Telangana: తెలంగాణలో ప్రసిద్ధి చెందిన చారిత్రాత్మక లాల్ దర్వాజా సింహవాహిని శ్రీ మహంకాళి ఆలయాన్ని టిపిసిసి అధ్యక్షులు, ఎమ్మెల్సీ బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ బుధవారం సందర్శించి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ నెల 11నుండి ప్రారంభం కానున్న లాల్ దర్వాజా బోనాల ఉత్సవాలకు ప్రభుత్వం తరపున అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని ఆయన తెలియజేశారు. ఆలయానికి విచ్చేసిన మహేష్ కుమార్ గౌడ్ ను ఆలయ మర్యాదలతో ఆలయ కమిటీ చైర్మన్ బి.మారుతీ యాదవ్,మాజీ చైర్మన్లు కె.వెంకటేష్, కె.విష్ణు గౌడ్,కన్వీనర్ జి.అరవింద్ కుమార్ గౌడ్ లు సాదరంగా స్వాగతం పలికి శాలువాతో సన్మానించి తీర్ధ ప్రసాదాలు అందజేశారు.

Exit mobile version