Tpccmaheshgoud: కేటీఆర్ పై టీపీసీసీ(TPCC )అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ ఓ రేంజ్ లో ఫైర్ అయ్యారు. గవర్నర్ ప్రసంగాన్ని అవమాన పరిచే విదంగా కేటీఆర్ మాట్లాడ్డం ఆయన అహంకారానికి పరాకాష్ట అని.. అధికారం పోయి రోడ్డు మీద పడ్డా బుద్ధి రాలేదని అన్నారు. కేటీఆర్ తక్షణమే గవర్నర్‌కు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.2025 – 26 శాసన సభ బడ్జెట్ సమావేశాల సందర్భంగా అసెంబ్లీలో మహేష్ గౌడ్ మీడియాతో మాట్లాడారు. గవర్నర్లను అవమానించిన చరిత్ర బిఆర్ఎస్ పార్టీదని దుయ్యబట్టారు.కాంగ్రెస్ తల్లి, రాహుల్ గాంధీ తండ్రి విగ్రహాలను ప్యాక్ చేస్తామంటూ కేటీఆర్ అహంకారంతో మాట్లాడుతున్నారని.. దమ్ముంటే విగ్రహాలపై చేయి వేసి చూడు కేటీఆర్. కాంగ్రెస్ కార్యకర్తలు బట్టలూడదీసి కొడతారని టీ పీసీసీ చీఫ్ హెచ్చరించారు.
కేసిఆర్ రాకను స్వాగతిస్తున్నాం..
ఇప్పటికైనా ప్రతి పక్షనేతగా కేసిఆర్ అసెంబ్లీకి రావడాన్ని స్వాగతిస్తున్నట్లు మహేష్ గౌడ్ తెలిపారు.ప్రతిపక్ష నేతగా కేసిఆర్ అసెంబ్లీ హాజరై … ప్రభుత్వానికి సలహాలు సూచనలు చేస్తే మంచిదని సలహా ఇచ్చారు.కేటీఆర్ రెచ్చగొట్టే మాటలు మాట్లాడి కాంగ్రెస్ కార్యకర్తల సహనాన్ని పరీక్షించొద్దని వార్నింగ్ ఇచ్చారు. రైతు రుణ మాఫీ లెక్కలు తెలియకుండా కేటీఆర్ అవాస్తవాలు మాట్లాడుతున్నారని.. క్షేత్రస్థాయిలో పర్యటిస్తే కాంగ్రెస్ ప్రభుత్వ పథకాల అమలు తీరు తెలుస్తుందని దెప్పిపొడిచారు.
కేసిఆర్ కుటుంబం గొప్పగా చెప్పుకుంటున్న కాళేశ్వరం, మేడిగడ్డ నాణ్యత ఏంటో బయపడినా మళ్లీ వాటి గురించి మాట్లాడడం కేటీఆర్(KTR ) దిగజారుడుతనానికి నిదర్శనమని విమర్శించారు. కులగణనలలో తప్పుడు లెక్కలు చెబుతున్నామని అంటున్న కేటీఆర్..సమగ్ర కుటుంబ సర్వే వివరాలను పదేళ్లుగా అధికారంలో ఉన్న ఎందుకు బహిర్గతం చేయలేదని టీపీసీసీ చీఫ్ నిలదీశారు.