‘పురుషుల దినోత్సవం’ .. ‘మిర్చి’ వినూత్న కార్యక్రమం.. అనూహ్య స్పందన.. !!

మనిషి 21వ శతాబ్దంలోకి అడుగుపెట్టినా… సమాజంలో ఇప్పటికీ లింగభేదం ఒక సమస్యగానే కొనసాగుతోంది. ఎక్కువశాతం మంది అనుకున్నట్టుగా ఇది స్త్రీలకు మాత్రమే పరిమితం కాదు, పురుషులు పట్ల కూడా సమాజంలో వివక్ష, ప్రతికూల అభిప్రాయాలు ఉన్నాయంటే కాలం మారిందే తప్ప మనుషుల ఆలోచన సరళి మారలేదన్నది నిజం. ఇప్పుడు ఈ టాపిక్ ఎందుకంటే … నేడు అంతర్జాతీయ పురుషుల దినోత్సవం. ఇదేంటి, పురుషుల దినోత్సవం అనేది కూడా ఒకటుందా అని ఆశ్చర్యపోతున్నారా? ఎస్… మీలాంటి వాళ్లకోసమే తరతరాలుగా మగవారిపై ఉన్న అపోహలను తొలగించడానికి నెంబర్ వన్ మిర్చి ఎఫ్.ఎం రేడియో వాళ్లు మెన్-ఓ-పాజ్ అనే పేరుతో ఒక వినూత్న కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున చేపట్టింది. ఇంటర్నేషనల్ మెన్స్ డే సందర్భంగా వారం రోజులుగా చేస్తున్నఈ కార్యక్రమానికి ప్రేక్షకుల నుంచి విశేష స్పందన లభిస్తోంది.

ఇక రెండు తెలుగు రాష్ట్రాల శ్రోతల మనసుల్లో బలమైన స్థానం సంపాదించుకున్న మిర్చి…  ప్రత్యేకంగా ఆన్ ఎయిర్ లో ‘మిర్చి జాతి రత్నం’ పేరుతో ప్రచారం నిర్వహించింది. సమాజంలో మగవాళ్ల పట్ల వివక్షకు సంబంధించి ప్రశ్నలు అడిగి, ఉత్తమ సమాధానాలు చెప్పినవారికి బహుమతులు అందజేసింది. వారం రోజులుగా ఆన్ ఎయిర్ తో పాటు, డిజిటల్ ప్లాట్ ఫామ్స్ పై పురుషల పట్ల సమాజంలో ఉన్న వివక్ష, ప్రతికూల అభిప్రాయాలను బ్రేక్ చేసేలా చేపట్టిన ఈ కార్యక్రమానికి ప్రేక్షకుల నుంచి విశేష స్పందన వస్తోంది. శ్రోతలు కాల్ చేసి మగవాళ్ల విషయంలో తప్పుడు అభిప్రాయాలను ఎత్తిచూపేలా ఆర్జేలు ప్రోత్సహించారు. ఇదే ఆన్ ఎయిర్ థీమ్ ని డిజిటల్ ప్లాట్ ఫామ్స్ కి కూడా విస్తరించారు. తెలుగు రాష్ట్రాల్లో అత్యంత ప్రజాధారణ పొందిన ఫేమస్ ఆర్జేలు మిర్చి సరన్, స్వాతి, శ్వేత, అమృత, ఇందు, భార్గవి, ప్రేమ్, ముఖేశ్, కావ్యలతో రీల్స్ తో పాటు వీడియోలు కూడా మిర్చి రూపొందించింది. పనిలో పనిగా… మీరు కూడా మగవాళ్ల బాధలను అర్థం చేసుకోవాలనుకుంటున్నారా? అయితే, మిర్చి డిజిటల్ ప్లాట్ ఫామ్స్ పై ఒక లుక్కెయండీ లేదా ఈ రోజు మిర్చి వినండి.

‘మిర్చి జాతి రత్నం’ లో ఫేమస్ ఆర్జేలు ..
ఇక రెండు తెలుగు రాష్ట్రాల శ్రోతల మనసుల్లో బలమైన స్థానం సంపాదించుకున్న మిర్చి..పురుషుల దినొత్సవాన్ని పురస్కరించుకుని ప్రత్యేకంగా ఆన్ ఎయిర్ లో ‘మిర్చి జాతి రత్నం’ పేరుతో ప్రచారం నిర్వహించింది.వారం రోజులుగా ఆన్ ఎయిర్ తో పాటు, డిజిటల్ ప్లాట్ ఫామ్స్ పై పురుషల పట్ల సమాజంలో ఉన్న వివక్ష, ప్రతికూల అభిప్రాయాలను బ్రేక్ చేసేలా చేపట్టిన కార్యక్రమానికి ప్రేక్షకుల నుంచి విశేష స్పందన లభించింది. శ్రోతలు కాల్ చేసి మగవాళ్ల విషయంలో తప్పుడు అభిప్రాయాలను ఎత్తిచూపేలా ఆర్జేలు ప్రోత్సహించారు. ఇదే ఆన్ ఎయిర్ థీమ్ ని డిజిటల్ ప్లాట్ ఫామ్స్ కి కూడా విస్తరించారు. అత్యంత ప్రజాధారణ పొందిన ఫేమస్ ఆర్జేలు మిర్చి సరన్, స్వాతి, శ్వేత, అమృత, ఇందు, భార్గవి లతో రీల్స్ తో పాటు వీడియోలు కూడా మిర్చి రూపొందించింది.

విభిన్న కాన్సెప్ట్ లతో ప్రచారం…

మెయిన్ స్ట్రీమ్ ప్రకటనల్లో మగవాళ్లను చూపించే విధానంపై ఆర్జే సరన్ వ్యంగంగా స్పందిస్తూ తన షో చేశారు. ఆర్జే అమృత మగవాళ్ల గురించి తన అభిప్రాయాలను ఒక నిమిషం నిడివిగల కవిత ద్వారా తెలియజేశారు. ఇక, ఆర్జే స్వాతి, ఆర్జే ఇందు హైదరాబాద్, విశాఖపట్నం గల్లీల్లో ప్రజలను కలుస్తూ మగవాళ్ల ప్రవర్తన గురించి, ఆదర్శాల గురించి వారికి ఉన్న అభిప్రాయాలను తెలుసుకుంటూ శ్రోతలను ఎంటర్టయిన్ చేశారు. శ్రోతలు, వ్యూయర్స్ ఆసక్తి కనబరిచేలా, కంటెంట్ మొత్తం కామెడీ టచ్ కలిగి ఉంది.

ఈ కార్యక్రమం గురించి  ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మరియు కర్ణాటక విభాగాల బిజినెస్ డైరెక్టర్ ఎం.ఎన్ హుస్సేన్ మాట్లాడుతూ.. “ అంతర్జాతీయ పురుషుల దినోత్సవం పురస్కరించుకొని ‘మెన్ -ఓ -పాజ్ అనే కార్యక్రమాన్ని నిర్వహించడం చాలా సంతోషంగా ఉందన్నారు. మిర్చిలో మేం ఎప్పుడూ సమాజానికి ఉపయోగపడే కార్యక్రమాల్ని నిర్వహించడంపై దృష్టి సారిస్తామన్నారు.వినూత్న కార్యక్రమం ద్వారా సమాజంలో మగవాళ్ల పట్ల ఉన్న వివక్ష, కొన్ని ప్రతికూల భావాలు, అభిప్రాయాల వల్ల వారు ఎదుర్కొంటున్న సమస్యల్ని మేం హైలట్ చేశామని.. ఇలాంటి మరెన్నోసమస్యలపై భవిష్యత్తులో కూడా మరిన్ని వినూత్న కార్యక్రమాలు చేపడతామని హుస్సేన్ వ్యాఖ్యానించారు. ఈ కార్యక్రమానికి సంబంధించిన ప్రత్యేక వీడియోల్ని @mirchi.telugu ఇన్ స్టాగ్రామ్, య్యూట్యూబ్ చానెల్స్ లో చూడవచ్చని.. ప్రత్యేకమైన షోల కోసం 98.3 మిర్చి వినే సదుపాయం ఉందన్నారు.

 

 

Related Articles

Latest Articles

Optimized by Optimole