తెలంగాణలో రాజకీయ వేడి రాజుకుంది. టీఆర్ఎస్ ఎమ్మెల్యే కవిత కాంగ్రెస్ పార్టీతో టచ్ లో ఉన్నారని బీజేపీ ఎంపీ అర్వింద్ చేసిన వ్యాఖ్యలు అగ్గిరాజేశాయి. దీంతో విమర్శలు , ప్రతివిమర్శల మాటల దాటి ఇళ్లపై దాడులు చేసే వరకు వెళ్లింది. అర్వింద్ వ్యాఖ్యలకు నిరసనగా ..కవిత అనుచరులు అతని ఇంటిపై దాడి చేయగా..పిచ్చివాగుడు వాగితే చెప్పు దెబ్బలు తప్పవని ఆమె వార్నింగ్ ఇచ్చింది. అటు అర్వింద్ సైతం దాడిపై ఫైర్ అయ్యారు.తాను ఇంట్లో లేనప్పడు .. టీఆర్ఎస్ గుండాలు ఇంట్లోకి ప్రవేశించి వస్తువులను పగలకొడుతూ నానా భీభత్సం సృష్టించి..మా అమ్మను బెదిరించారని ట్విట్ చేశారు. రాష్ట్రంలో బీజేపీ ఎదుగుదలను ఓర్వలేకనే టీఆర్ఎస్ దాడులకు పాల్పడుతుందని బీజేపీ నేతలు మండిపడ్డారు.
కాగా ఎంపీ అర్వింద్ వ్యాఖ్యలపై ఎమ్మెల్సీ కవిత స్పందిస్తూ..అవాకులు చెవాకులు పేలితే నిజామాబాద్ నడిరోడ్డుమీద చెప్పుతో కొడతానని వార్నింగ్ ఇచ్చారు.అంతేకాక చాలాకాలం నుంచి బీజేపీ నుంచి ఆఫర్లు వచ్చాయంటూ సంచలన ఆరోపణలు చేశారు కవిత. ఈనేపథ్యంలోనే ఆమె అనుచరులు ఎంపీ అర్వింద్ ఇంటిపై దాడి చేసి నానారభస చేశారు.ఇంట్లో వస్తువులు పగలకొడుతూ ..దేవుని పటాలు ధ్వంసం చేశారు.
అటు దాడి ఘటనపై ఎంపీ అర్వింద్ సీరియస్ అయ్యారు. తాను ఇంట్లో లేని సమయం చూసి టీఆర్ఎస్ గుండాలు అరాచకానికి పాల్పడినట్లు మండిపడ్దారు. తన తల్లిని బెదిరింపులకు గురిచేసినట్లు ఆరోపించారు.తనపై పోటిచేసి ఓడిస్తానన్న కవిత సవాల్ ను స్వీకరిస్తున్నట్లు తేల్చిచెప్పారు.2024లో నిజామాబాద్ లోక్ సభ సీటు కోసం తనతో తలపడాలని ఆమెకు అర్వింద్ సూచించారు.
ఇదిలా ఉంటే.. ఎంపీ ఇంటిపై దాడిని బీజేపీ నేతలు ఖండించారు.టీఆర్ఎస్ సిగ్గుమాలిన చర్యగా రాష్ట్ర బీజేపీ వ్యవహారాల ఇంచార్జ్ తరుణ్ చుగ్ అభివర్ణించారు. ఈదాడి టీఆర్ఎస్ పతనానికి నాందిగా పేర్కొన్నారు.రాజకీయ విమర్శలను,ప్రతి విమర్శలను ఎదుర్కొవాలే తప్ప..ఇలాంటి అనైతిక చర్యలకు పాల్పడటం హేయమైన చర్యని మాజీ ఎంపీ బూర నర్సయ్యగౌడ్ అన్నారు.ఇలాంటి దాడులుకు బీజేపీ తెగపడితే..టీఆర్ఎస్ తట్టుకోగలదా అన్ని ప్రశ్నించారు.టీఆర్ఎస్ గుండాలు ఇంట్లోకి వెళ్లి దాడి చేయడం సమంజసమేనా అని ప్రశ్నించారు డీకే అరుణ.తెలంగాణలో నియంత పాలన సాగుతోందని మండిపడ్డారు.