Newsminute24

జగన్ పార్టీ ఎందుకు పెట్టారు?: ఎంపీ రఘురామ కృష్ణంరాజు

వైకాపా నేతల్లో అసంతృప్తి అంతకంతకు పెరుగుతోందన్నారు నరసాపురం ఎంపీ రఘురామకృష్ణం రాజు. అసంతృప్త నేతలను తమ పార్టీ నాయకులతో ఒకరిద్దరు తిట్టినంత మాత్రాన ఈ అసంతృప్తులు ఆగవని హెచ్చరించారు. పార్టీ నాయకుల్లో పెరుగుతున్న అసంతృప్తి చల్లారాలంటే మన ఆలోచన విధానం మారాలన్నారు. నియంతలం… ఎవరైనా మనం చెప్పినట్టే వినాలని అనుకుంటే మాత్రం తీవ్రంగా నష్టపోవాల్సి వస్తుందన్నారు. ఎమ్మెల్యే గా ఎన్నికైన జగన్, ముఖ్యమంత్రి అయినప్పుడు..అదే ఎమ్మెల్యేగా గెలిచిన కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి కున్న అధికారాలలో రవ్వంత అధికారాన్ని కోరుకోవడం తప్పేమీ కాదు కదా అని రఘురామ ప్రశ్నించారు.

జగన్ పార్టీ ఎందుకు పెట్టారు?
వైయస్ జగన్మోహన్ రెడ్డి కాంగ్రెస్ ను వీడి పార్టీ ఎందుకు పెట్టారని రఘురామకృష్ణం రాజు ప్రశ్నించారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి మరణానంతరం జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి పదవిని ఆశించారు. కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ , ముఖ్యమంత్రి పదవిని ఆయనకు కట్టబెట్టడానికి నిరాకరించారు. దానితో, జగన్మోహన్ రెడ్డి అలిగి.. కాంగ్రెస్ ను వీడి శివకుమార్ దగ్గర పార్టీని కొనుక్కుని, ఆ తరువాత ముఖ్యమంత్రి అయ్యారని గుర్తు చేశారు . ఈ దురవస్థకు దూరంగా ఉండాలని భావిస్తున్న కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిని దేశద్రోహి గా.. పార్టీ ద్రోహి అన్నట్లు చిత్రీకరించడం ఎంతవరకు సబబు అని రఘురామకృష్ణంరాజు నిలదీశారు.

 

Exit mobile version