Site icon Newsminute24

Hyderabad: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కవిత పోటీ?

హైదరాబాద్‌ : జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నికపై రాష్ట్ర రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చలు మొదలయ్యాయి. ముఖ్యంగా ఎమ్మెల్సీ కవిత పోటీ చేసే అవకాశంపై గుసగుసలు వినిపిస్తున్నాయి. కవిత స్వయంగా కొత్త రాజకీయ పార్టీ స్థాపనపై దృష్టి సారించినట్లు సమాచారం. ఆ క్రమంలోనే జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నికలో తన శక్తిని పరీక్షించుకోవాలని భావిస్తున్నారని రాజకీయ వర్గాల టాక్‌. ఇందుకోసమే ప్రత్యేక సర్వేలు నిర్వహిస్తున్నారని తెలుస్తోంది.

విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం..కవిత నిజంగా బరిలోకి దిగితే, ఆమె విజయావకాశాలు ఎలా ఉన్నా, బీఆర్ఎస్‌కు మాత్రం నష్టం తప్పదని భావిస్తున్నారు. ఓట్ల విభజన దిశగా ఈ పోటీకి పెద్ద ఎత్తున ప్రాధాన్యం ఏర్పడే అవకాశం ఉందని అంటున్నారు.
మొత్తంగా కవిత ఎంట్రీతో జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నిక రాష్ట్ర రాజకీయాలను మలుపు తిప్పే కీలక అంశంగా రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

Exit mobile version