ఆరోగ్య సంరక్షణకు పెద్దపీట..?

– అధిక నిధుల కేటాయింపు పై ఆశాభావం

కోవిడ్ ఫలితంగా ప్రజారోగ్య పరిరక్షణ వ్యవస్థ డొల్లతనం బయటపడింది. ప్రాథమిక వైద్య కేంద్రాలు, ప్రయివేటు ఆసుపత్రులున్న, సేవలు అందించలేని పరిస్థితి ఏర్పడింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వాలు వైద్య ఆరోగ్య సంరక్షణకు నిధుల కేటాయింపు పెంచాలనే డిమాండు పెరుగుతుంది. 2021-22 ప్రవేశపెట్టె బడ్జెట్లో వైద్య రంగానికి నిధుల కేటాయింపు ఎలా ఉండబోతుందన్న ప్రశ్న అన్ని వర్గాల్లోను ఆసక్తి రేకెత్తిస్తోంది. మరోవైపు కోవిడ్ ముంపు తొలగకపోవడం.. భవిష్యతులో ఇలాంటి ఇబ్బందులు తలెత్తవని చెప్పడానికి వీలులేకపోవడం తద్వారా వైద్య రంగాన్ని బలోపేతం చేయాలనే కోరిక అందరిలో బలంగా ఉంది.

ప్రధాన డిమాండ్లు..

– గ్రామీణ వైద్య సేవల విస్తరణకు పెద్దపీట వేయాలి.

– కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు 2025 నాటికి జీడీపీలో 2.5 శాతానికి పెంచాలి.

-వైద్య రంగానికి పరిశ్రమ హోదా ఇవ్వాలనే డిమాండ్ ఎంతో కాలంగా ఉంది.దీన్ని సాకారం చేస్తారేమోన్న ఆకాంక్ష.