రాష్ట్ర భవిష్యత్తుకు దిశానిర్దేశం చేసేలా జనసేన ఆవిర్భావ సభ: నాదెండ్ల మనోహర్

మచిలీపట్నలో ఈ నెల 14వ తేదీన నిర్వహించబోయే జనసేన పార్టీ ఆవిర్భావ సభ రాష్ట్ర రాజకీయ భవిష్యత్తుకు ఒక దిశా నిర్దేశం చూపేలా ఉంటుందన్నారు పార్టీ పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్. రాబోయే రోజుల్లో జనసేన పార్టీ భవిష్యత్తు కార్యాచరణను పార్టీ అధ్యక్షులు  పవన్ కళ్యాణ్ ప్రకటించనున్నారని తెలిపారు. జనసేన పార్టీ ఆవిర్భావ సభ స్థలాన్ని ఆయన బుధవారం సాయంత్రం పరిశీలించారు. అనంతరం మచిలీపట్నంలో ఉమ్మడి కృష్ణాజిల్లా జనసేన పార్టీ స్థాయి సమావేశానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా మీడియా సమావేశంలో  నాదెండ్ల మాట్లాడుతూ.. “రాష్ట్ర రాజకీయ చరిత్రలో కనివినీ ఎరుగని రీతిలో ఆవిర్భావ సభ జరగనుందన్నారు. ఇప్పటికే సభ నిర్వహించుకునేందుకు 34 ఎకరాలను రైతులు స్వచ్ఛందంగా ఇచ్చారన్నారు. దానికి అదనంగా మరో 60 ఎకరాల భూమినీ సభ అవసరాల నిమిత్తం ఇచ్చేందుకు రైతులు ముందుకు రావడం అనందంగా ఉందని తెలిపారు. ఎలాంటి ఇబ్బందులు రాకుండా పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేయబోతున్నామన్నారు. లక్షల మంది సభకు వస్తారని అంచనా వేస్తున్నట్లు.. దానికి అనుగుణంగా ఏర్పాట్లు శరవేగంగా ఏర్పాట్లు జరుగుతున్నట్లు నాదెండ్ల స్పష్టం చేశారు.

ఏపీ రాష్ట్ర రాజకీయాల్లో ఒక మార్పు తీసుకొచ్చేందుకు జనసేన ఆవిర్భావ సభ ఒక పునాది కానుందన్నారు మనోహర్. జనసేన రాజకీయ పోరాటం మీద అధ్యక్షుల వారు పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేస్తారన్నారు. అలాగే రాష్ట్ర ప్రజల భవిత, రాష్ట్ర గతి మెరుగుపడాలంటే ఎం చేయాలో కూడా ఆయన చెబుతారని వెల్లడించారు. పార్టీ ఆవిర్భావ సభలోనే ఉమ్మడి కృష్ణా జిల్లాకు సంబంధించి ఆత్మహత్యలకు పాల్పడిన కౌలు రైతుల కుటుంబాలను ఆదుకునే కార్యక్రమం జరగనుందన్నారు. జగన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా 3 వేల మంది కౌలు రైతులు ఆత్మహత్యలకు పాల్పడితే ఉమ్మడి కృష్ణా జిల్లాలో మాకు అందిన సమాచారం మేరకు 51 మంది కౌలు రైతులు ఆత్మహత్యలకు పాల్పడినట్లు సమాచారం ఉందన్నారు నాదెండ్ల. ఇప్పటికే జనసేన బృందం క్షేత్రస్థాయిలో కౌలు రైతుల కుటుంబాలను కలుస్తోందన్నారు. వారికీ తగిన సహాయం అందించేలా ఏర్పాట్లు జరుగుతున్నాయన్నారు.  అలాగే ఇటీవల పార్టీ చేపట్టిన మూడో విడత క్రియాశీలక సభ్యత్వ నమోదు లో బాగా పని చేసిన వాలంటీర్లకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు నాదెండ్ల మనోహర్.

 

Optimized by Optimole