×

Janasena:వీరులకు పుట్టుకేగాని గిట్టుక ఉండదని.. వారి చైతన్యం సదా ప్రసరిస్తూనే ఉంటుందన్నారు జనసేన అధినేత పవన్ కల్యాణ్. వారు రగిల్చిన విప్లవాగ్ని సర్వదా జ్వలిస్తూనే ఉంటుందన్నారు. అటువంటి ధీరుడే మన మన్నెం వీరుడు శ్రీ అల్లూరి సీతారామ రాజు అని కొనియాడారు. ఆ మహా యోధుడు వీర మరణం పొంది నేటికీ వందేళ్లు.. ఈ పుణ్య తిధినాడు ఆ విప్లవ జ్యోతికి భక్తిపూర్వకంగా ప్రణామాలు అర్పిస్తున్నట్లు జన సేనాని పేర్కొన్నారు. కారణజన్ములు తాము చేయవలసిన కార్యాన్ని పూర్తి చేసి అదృశ్యమైపోతారన్నారు.  దాస్యశృంఖలాలతో అణగారిపోతున్న ప్రజలలో చైతన్యం రగల్చడానికి వచ్చిన  సీతారామరాజు..ఆ కార్యం నెరవేర్చి, నవ యువకుడిగానే మహాభినిష్క్రమణం గావించారని అన్నారు.  సీతారామరాజు మన్యం ప్రజలలో రగిల్చిన విప్లవాగ్ని గురించి తెలుగు నేల నలు చెరగులకూ విదితమేనని పవన్ స్పష్టం చేశారు.

భారతరత్న ప్రకటించాలి…

నేటి తరం దేశవాసులందరికీ  అల్లూరి సీతారామరాజు సంకల్పం.. పోరాట పటిమ.. ధీరత్వం.. మృత్యువుకు వెరవని ధైర్యం.. జ్ఞాన-ఆధ్యాత్మిక సంపదల గురించి తెలియాలన్నారు పవన్. అందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పూనుకోవాలని.. భారత రత్న ప్రకటించి ఆ పురస్కారానికి మరింత వన్నె అద్దాలన్నారు. విప్లవ వీరును జయంతిని రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా పెద్ద ఎత్తున నిర్వహించాలని సూచించారు. ఆయన స్ఫూర్తిని దేశమంతటికీ చాటాలని పిలుపునిచ్చారు. జనసేన అధికారంలోకి వస్తే ఆ బాధ్యతను మేమే స్వీకరిస్తామని.. ఆ చైతన్యమూర్తి వర్ధంతి సందర్భంగా వినమ్రంగా ప్రకటిస్తూ ఆ తేజోమూర్తికి నా పక్షాన, జనసేన పక్షాన అంజలి ఘటిస్తున్నట్లు పవన్ చెప్పుకొచ్చారు.

 

Author

dhoni.raju219@gmail.com

Related Posts

National: ప్రత్యామ్నాయంతోనే ఏకాభిప్రాయం…!

Delimitation: నియోజకవర్గాల పునర్విభజన, మహిళా రిజర్వేష‌న్ అమలు – కీలకమైన ఈ రెండు అంశాల్లో ఏకాభిప్రాయం సాధన దేశంలో ఒక సవాల్‌గా తయారయింది. వీటితో ముడిపడి ఉన్న కొన్ని సున్నితాంశాల్లో...

Read out all

Telangana: ఇందిరమ్మ క్యాంటీన్లపై పీపుల్స్ పల్స్ నివేదిక…

Telangana: భూమ్మీద ‘పేదరికం’ ఏ రూపంలో ఉన్నా నిర్మూలించాలని, ‘ఆకలి’ అనే శబ్దానికి తావులేని ప్రపంచం ఏర్పడాలని ఐక్యరాజ్యసమితి (యూఎన్) కోరింది. కీలకమైన ఈ రెండంశాలనే ఒకటి, రెండుగా పేర్కొంటూ...

Read out all

politics: పుదుచ్చేరిలో ఎన్డీయేకు స్వల్ప ఆధిక్యం..!!

National: పుదుచ్చేరిలో ఏప్రిల్ 9వ తేదిన జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీయే స్వల్ప మెజారిటీతో అధికారంలోకి వచ్చే అవకాశాలు ఉన్నట్లు పీపుల్స్ పల్స్ రీసర్చ్ సంస్థ నిర్వహించిన ప్రీ పోల్...

Read out all

Telangana: విద్య, వైద్యంతోనే వికాసం…!!

Telangana: తెలంగాణ బడ్జెట్ ప్రతిపాదనల్లో విద్యకు ప్రాధాన్యతనిచ్చారు. ఇదే చొరవతో నిధుల కేటాయింపు కూడా జరిపి, అమలులో శ్రద్ద తీసుకుంటే రాష్ట్రంలో విద్యారంగం బాగుపడటానికి ఆస్కారం ఉంది. వైద్యరంగం మీద...

Read out all

Assam: అస్సాంలో హ్యాట్రిక్ దిశగా బీజేపీ..!!

Assam election: ఈశాన్య రాష్ట్రం, అస్సాంలో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ప్రజలు ఎటువైపు మొగ్గు చూపుతున్నారో ఇప్పటికే స్పష్టంగా తెలుస్తోంది. 2026 అసెంబ్లీ ఎన్నికలు మార్పు కోసం కాకుండా...

Read out all

HJDORA: వైవిధ్య కలపోత..!!

దిలీప్ రెడ్డి (సీనియర్ జర్నలిస్ట్): అది 1996 నవంబర్. అప్పటి CID చీఫ్ ఆఫీస్ డీజీపీ కార్యాలయ ప్రాంగణంలోనే, సుమారు ఇరవై అర్థచంద్రాకారపు మెట్ల పైన ఎంతో దర్జాగా, ఠీవీగా...

Read out all
Optimized by Optimole