Telangana: బిస్మిల్లా ఖాన్ యువ పురస్కారం అందుకున్న శ్వేత ప్రసాద్..!

Hyderabad: నగరానికి చెందిన శ్వేత ప్రసాద్ కర్ణాటక సంగీతం విభాగములో బిస్మిల్లా ఖాన్ యువ పురస్కారం అందుకున్నారు. శుక్రవారం  ఢిల్లీ లో జరిగిన కార్యక్రమంలో సాంస్కృతిక శాఖ కార్యదర్శి అరుణిష్ చావ్లా చేతుల మీదుగా శ్వేత ప్రసాద్ పురస్కారం అందుకున్నట్లు సంగీత నాటక అకాడమీ తన  ట్విట్టర్ ఖాతా ద్వారా వెల్లడించింది.

కాగా  ప్రతి ఏటా సంగీత విభాగంలో  ఉత్తమ ప్రతిభ కనబరిచిన కళాకారులను ఈ యువ పురస్కారం కోసం ఎంపిక చేయడం జరుగుతుంది. అందులో భాగంగానే హైదరాబాద్ కి శ్వేత ప్రసాద్ 2022-23 సంవత్సరానికి గాను  ఎంపికైంది.  ఈ పురస్కారం   కార్యక్రమంలో సాంస్కృతిక శాఖ సంయుక్త కార్యదర్శి ఉమ నండూరి, సంగీత నాటక అకాడమీ వైస్ చైర్మన్ సంధ్య, రాజు దాస్  పాల్గొన్నారు.

 

Optimized by Optimole