దేశంలో పసిడి ధరలు స్వల్పంగా పెరిగాయి.
శుక్రవారం కాస్త తగ్గినా బంగారం ధర నేడు మార్కెట్ ధరల్లో స్వల్ప వ్యత్యాసం కనిపిస్తోంది . అయితే దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో బంగారం ధరల్లో మార్పులు కనిపిస్తున్నాయి. శనివారం గోల్డ్ ప్రైజ్‌ను గమనిస్తే, దేశంలో 22 క్యారట్ బంగారం ధర పది గ్రాములకు గాను 47 వేల 40 రూపాయలు కాగా, 24 క్యారెట్ బంగారం 48 వేల 40 రూపాయలుగా ఉంది. ఇక దేశవ్యాప్తంగా పలు నగరాల్లో బంగారం ధరలను చూస్తే… చెన్నైలో 22 క్యారెట్ 45 వేల 240 రూపాయలు, 24 క్యారెట్ బంగారం 49 వేల 350 రూపాయలుగా ఉంది. అదే, హైదరాబాద్‌లో 22 క్యారెట్ బంగారం 44 వేల 940 రూపాయలుగా ఉంటే, 24 క్యారెట్ గోల్డ్ 49 వేల 30 రూపాయలుగా ఉంది. ఇక, బెంగళూరు, విజయవాడ, విశాఖపట్నం నగరాల్లోనూ ఇవే ధరలు కనిపిస్తున్నాయి.