కరోనాతో రెండేళ్లు వాయిదాపడిన అమర్ నాథ్ యాత్ర ఎట్టకేలకు ప్రారంభమయ్యింది.అమరనాథుడిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివెళ్తున్నారు. ఈనేపథ్యంలో భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా.. ఆర్మీ తగు జాగ్రత్తలు తీసుకుంటుంది.ఇటీవల కొండచరియలు విరిగిపడటంతో కొట్టుకుపోయిన బల్తాల్ బ్రిడ్జిని ఆర్మీ అతి తక్కువ సమయంలోనే పునర్మించింది. యాత్ర నిరాటంకంగా కొనసాగేలా జవాన్లు నిరంతరం పర్యవేక్షిస్తున్నారు.
జూలై 1న కాళీమాతా ఆలయ సమీపంలోని బల్తాల్ వద్ద.. కొండ చరియలు విరిగిపడటంతో వంతెనలు కొట్టుకుపోయాయి. ఈవిషయాన్నిగమనించినఇండియన్ ఆర్మికి చెందిన చినార్ కార్ప్స్..తక్షణమే పునరుద్ధరణ చర్యలను చేపట్టింది. ప్రత్యేక హెలికాప్టర్‌లో బ్రిడ్జి నిర్మాణానికి అవసరమైన సామాగ్రిని తరలించింది. కేవలం నాలుగు గంటల్లోనే సాంకేతిక నిపుణుల సహయంతో కొత్త బ్రిడ్జిని నిర్మించింది. యాత్రకు ఇబ్బందులు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకుంటున్న జవాన్లపై సర్వత్రా ప్రశంసల వర్షం కురుస్తోంది.