ఆకాశానికి విల్లుఎక్కు పెట్టిన ప్రభాస్ .. అదిరిపోయిదంటూ డార్లింగ్ అభిమానులు రచ్చ..!!

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న తాజా పాన్ ఇండియా చిత్రం ఆదిపురుష్. రామాయణం ఇతిహాసం ఆధారంగా  ఈ సినిమాను 500 కోట్ల భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు.   రాముడిగా ప్రభాస్ సీతా పాత్రలో కృతిసనన్ కనిపించనున్నారు. ఇప్పటికే దసరా కానుకగా చిత్ర టీజర్ ను విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం  ప్రకటించింది. ఈనేపథ్యంలోనే  డార్లింగ్ అభిమానుల కోసం ప్రత్యేకంగా టీజర్ ఫస్ట్ లుక్ ను విడుదల చేసింది చిత్రబృందం. మోకాళ్లపై కూర్చుని విల్లు ఆకాశానికి ఎక్కుపెట్టినట్లు ఉన్న ప్రభాస్ పోస్టర్ అద్భుతంగా ఉంది. ఈపోస్టర్ పై డార్లింగ్ అభిమానులు సోషల్ మీడియా వేదికగా ఆనందం వ్యక్తం చేస్తున్నారు.సాక్ష్యాత్తు కోదండరాముడి వలే డార్లింగ్ ఉన్నాడని దసరా పండగా ముందే మొదలైందంటూ  సోషల్ మీడియాలో పోస్టులతో రచ్చ చేస్తున్నారు.

కాగా ఆదిపురుష్ సినిమాను టీ సిరీస్ బ్యానర్ పై భూషణ్ కుమార్ నిర్మిస్తున్నారు.ప్రస్తుతం మూవీ పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది. ఓంరౌత్ దర్శకత్వం వహిస్తున్న ఈమూవీలో.. బాలీవుడ్ హీరో సైఫ్ అలీఖాన్ లంకేశ్ గా ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. 2023 జనవరి 12 న చిత్రాన్ని థియేటర్లలో రిలీజ్ చేసేందుకు నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు.భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న మూవీ కోసం ప్రపంచవ్యాప్తంగా అభిమానులు ఆతృతగా ఎదురుచూస్తున్నారు.

ఇక దసరా పండగా సందర్భంగా రామ్ లీలా మైదానంలో యూపీ  సీఎం యోగి  చేతుల మీదుగా చిత్ర టీజర్ ను విడుదల చేయనున్నారు. ఈవేడుకను భారీ ఎత్తుగా నిర్వహించేందుకు చిత్ర యూనిట్ ఇప్పటికే సన్నాహక కార్యక్రమాలు మొదలెట్టింది. 

Optimized by Optimole