కేసిఆర్ సీఎం పదవికి రాజీనామ చేయాలి: తరుణ్ చుగ్

ఎట్టకేలకు దిల్లీ లిక్కర్ స్కాంలో గుట్టు రట్టయిందన్నారు బిజెపి జాతీయ ప్రధాన కార్యదర్శి , రాష్ట్ర ఇంచార్జ్ తరుణ్ చుగ్. ఈ మేరకు ఆయన ప్రకటన విడుదల చేశారు. ఈడీ దాఖలు చేసిన ఛార్జిషీట్‌లో తెలంగాణ ముఖ్యమంత్రి కేసిఆర్  కుమార్తె కవిత ప్రమేయాన్ని నిర్ధారించడంతో బిజెపి ఆరోపణలు నిజమని రుజువైందన్నారు. సౌత్‌ గ్రూప్‌లో భాగంగా ఆప్ దళారుకు..కవితలు రూ.100 కోట్లకు పైగా లంచం ఎలా అందజేసింది.. ఈ డీల్ ద్వారా ఈ గ్రూప్‌కి రూ.192 కోట్లకు పైగా లాభం ఎలా వచ్చిందనేది ఛార్జిషీట్‌లో స్పష్టంగా వివరించారని స్పష్టం చేశారు. కేసీఆర్, ఆయన కుటుంబం అవినీతికి పాల్పడ్డారని బిజెపి ఎప్పటి నుంచో ఆరోపిస్తూనే ఉందన్నారు.

ఇక లిక్కర్ స్కాంపై ముఖ్యమంత్రి మౌనం వహించడం దేనికి సంకేతమని?.. మద్యం స్కాం  నుంచి ప్రజల దృష్టిని మరల్చేందుకు..తన కూతురిని కాపాడుకునేందుకు బీఆర్ఎస్ పేరుతో కేసీఆర్ ఆడుతున్న డ్రామా స్పష్టంగా అర్థమవుతోందన్నారు.కవితపై ఈడీ ఛార్జిషీట్ వేసిన నేపథ్యంలో, నిష్పక్షపాత దర్యాప్తు కోసం కెసిఆర్ తన పదవికి రాజీనామా చేయాలని తరుణ్ చుగ్ డిమాండ్ చేశారు.

 

 

Related Articles

Latest Articles

Optimized by Optimole