సుగంధ ద్రవ్యాల బోర్డు సభ్యునిగా ఎంపీ అర్వింద్..

సుగంధ ద్రవ్యాల బోర్డు సభ్యునిగా నిజామాబాద్ ఎంపీ అర్వింద్ ధర్మపురి ఎన్నికయ్యారు. ఈ ఎన్నికకు  సంబంధించి పార్లమెంట్  బులిటెన్ విడుదల చేసింది. 

 ఈ సందర్భంగా ఎంపీ అర్వింద్ మాట్లాడుతూ.. పార్లమెంట్ సభ్యునిగా ఎన్నికైన   8 నెలల కాలంలోనే మోడీ ప్రభుత్వం నిజామాబాద్ కేంద్రంగా ” రీజినల్ ఆఫీస్ కం ఎక్స్టెన్షన్ సెంటర్ ” మంజూరు చేసిందని గుర్తు చేశారు. బోర్డు ద్వారా  30 కోట్ల బడ్జెట్ ను 2022-2025 మధ్య మూడేళ్ల కాలానికి పార్లమెంట్ ఆమోదించిందని.. 1986 నుండి 2020 వరకు 35 ఏళ్లలో కూడా రానటువంటి బడ్జెట్ ను ఈ మూడేళ్ల కాలానికే తెచ్చుకున్నామన్నారు. ఇదివరకే 9 కోట్ల రూపాయల నిధులు విడుదల అయ్యాయని అరవింద్ పేర్కొన్నారు. ఈ అవకాశం వలన నిజామాబాద్ పార్లమెంట్ పరిధిలోని ప్రాంత పసుపు రైతులకు మరింత సేవ చేసే అవకాశం లభించిందన్నారు.   పసుపు, మిర్చి పంటల రైతుల అభివృద్ధి, సంక్షేమమే ధ్యేయంగా కేంద్రం మరింతగా కృషి చేస్తుందని ఎంపీ అర్వింద్ స్పష్టం చేశారు.

Related Articles

Latest Articles

Optimized by Optimole