వర్షకాలంలో ప్రకృతి పరవశిస్తోంది. జలపాతాలు పొంగి పోర్లుతుండటంతో సుందర దృశ్యాలు కనువిందు చేస్తున్నాయి. ఈక్రమంలో ఓ జలపాతం పర్యాటకులను ఆకర్షిస్తోంది. ఇది చూస్తే మీరు కూడా ఎప్పుడుప్పుడు అక్కడి వెళ్లి.. వాటర్ ఫాల్స్ అందాలను తిలకిందామా అని ఆరాటపడతారు.
This is not Niagara Falls…
This is Jog Falls, located in Shimoga district of Karnataka, India🇮🇳— Erik Solheim (@ErikSolheim) July 10, 2022
ఈవీడియోలో కనిపిస్తున్న జలపాతం కర్ణాటకలోని జోగ్ జలపాతం. అత్యంత సుందరప్రదేశాలలో ఒకటి. వర్షకాలం వచ్చిదంటే చాలు పర్యాటకులు ఇక్కడికి క్యూ కడతారు. నయాగార జలపాతం మాదిరి వాటర్ ఫాల్స్ ఇక్కడి ప్రత్యేకత. కొండ పై నుంచి జాలువారే వాటర్ ఫాల్స్ సుందరమనోహర దృశ్యాలు పర్యాటకుల మనసులను పులకరింపజేస్తాయి.
జోగ్ వాటర్ ఫాల్స్ వీడియోని నార్వేజియన్ మాజీ దౌత్యవేత్త ఎరిక్ సోల్హీమ్ ట్విట్టర్ లో షేర్ చేశారు. ఇది నయాగరా జలపాతం కాదు.. కర్ణాటకలోని షిమోగా జిల్లాలో ఉన్న జోగ్ జలపాతం అని క్యాప్షన్ తో ఉన్న వీడియో క్రెడిట్ రఘు చెందుతుందని ఎరిక్ స్పష్టం చేశారు. ట్విట్టర్ లో సుమారు 1.8 లక్షల మంది వీడియోని వీక్షించగా వేల సంఖ్యలో లైక్స్ వస్తున్నాయి. వందలాది మంది నెటిజన్స్ పోస్టును రీ ట్వీట్ చేశారు. ప్రకృతి అందాలు అంటూ ఓనెటిజన్ కామెంట్ చేయగా.. చాలా అందంగా ఉందంటూ మరో నెటిజన్ క్యాప్షన్ జతచేశాడు.