మూసీకి పెరుగుతున్న వరద ఉధృతి..ఆరు గేట్లు ఎత్తివేత!

ఉమ్మడి నల్లగొండ జిల్లాలో 44 వేల ఎకరాలకు సాగునీరు అందించే మూసీ ప్రాజెక్టు నిండుకుండను తలపిస్తోంది. ఎగువన కురుస్తున్న వర్షాలకు ప్రాజెక్టుకు వరద తాకిడి పెరగడంతో జలకళ సంతరించుకుంది. వరద ఉధృతి పెరగడంతో ప్రాజెక్టు ఆరు గేట్లను ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. డ్యాం పూర్తిస్థాయి నీటిమట్టం 645 అడుగుల కాగా.. ప్రస్తుతం 638.30 అడుగులకు నీరు చేరింది. ఇన్ ఫ్లో 3800 క్యూసెక్కులు.. జౌట్ ఫ్లో 3200 క్యూసెక్కులుగా ఉంది. డ్యాం గేట్లు తెరిచారన్న సమాచారంతో ప్రాజెక్టు అందాలను చూసేందుకు పర్యాటకులు తరలివస్తున్నారు.