సాయిబాబా ఆలయంలో ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి ప్రత్యేక పూజలు!

గురుపౌర్ణమి సందర్భంగా ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి పట్టణంలోని దేవాలయాలను దర్శించుకున్నారు. సాయిబాబా దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అన్న ప్రసాద వితరణ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కరోనా కారణంగా రెండు సంవత్సరాలు సాంప్రదాయబద్ధంగా నిర్వహించుకునే పూజాకార్యక్రమాలు నిలిచిపోయాయని.. ఈఏడాది దేవుడి ఆశీస్సులతో దేవాలయాలు పునర్వైభవంతో దేదీప్యమానంగా వెలిగిపోతున్నాయని అన్నారు. ప్రజలకు ఆయురారోగ్యాలు ప్రసాందించాలని భగవంతున్ని ప్రార్థించినట్లు భూపాల్ రెడ్డి స్పష్టం చేశారు. ఈకార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ మందడి సైదిరెడ్డి, పట్టణ పార్టీ అధ్యక్షుడు  పిల్లి రామమరాజు , పలు వార్డుల కౌన్సిలర్స్, తదితరులు పాల్గొన్నారు.