సహజ నటి ‘మణి’ జయంతి.. నివాళి!

కులం మతం ప్రాంతంతో సంబంధం లేకుండా అన్ని వర్గాలను అక్కునచేర్చుకునేది సినికళామా తల్లి..ఈ తల్లి చెంతకు అనునిత్యం ఎంతో మంది వస్తుంటారు పోతుంటారు..తమకంటూ ఓ గుర్తింపు తెచ్చుకొని ప్రేక్షకుల హృదయాల్లో స్థానం సంపాదించుకున్నవారు మాత్రం అరుదు..ముఖ్యంగా నటీమణులు సంఖ్య స్వల్పం..అలాంటి నటిమణుల్లో సౌందర్య స్థానం ప్రత్యేకం..అందం అభినయంతో అన్ని వర్గాలు ప్రేక్షకులను అలరించింది.సహజ ‘నటి’గా ప్రేక్షుకుల హృదయాల్లో స్థానం పొందిన సౌందర్య జయంతి నేడు..

నేపథ్యం:

కర్ణాటకలోని కోలార్ జిల్లా ముల్బాగల్ ఓ చిన్న టౌన్ ల్ జులై 18, 1972న సౌందర్య జన్మించింది. తల్లిదండ్రులు సత్యనారాయణ మంజుల.చిన్నతనం నుంచి అన్నింట్లో ముందుండే సౌందర్య నటి అవుతానని కలలో కూడా ఊహించలేదు. ఎంబిబిఎస్ మొదటి సంవత్సరం చదువుతుండగా సినిమా అవకాశం రావడంతో చదువు మధ్యలో మానేసి సినిఅరంగ్రేటం చేసింది..తొలిచిత్రం రైతు భారతం కాగా మొదట విడుదలైన చిత్రం మాత్రం ‘మనవరాలు పెళ్లి’.

తెలుగులో అగ్రహీరోలందరి సరసన నటించిన సౌందర్య తన సినీజీవితంలో తెలుగు తమిళ్ మలయాళం హిందీ కన్నడ భాషల్లో కలిపి దాదాపు 100 పైగా చిత్రాల్లో నటించింది. అందం అభినయంతో అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంది..ముఖ్యంగా కట్టుబొట్టుతో తెలుగింటి ఆడపడుచుగా తాను పోషించిన పాత్రలు ఫ్యామిలీ ఆడియన్స్నికి దగ్గరి చేసింది.ముఖ్యంగా హీరో వెంకటేష్ తాను కలిసి నటించిన సినిమాలకు ప్రేక్షకులు బ్రహ్మానందం పట్టారు.సినీ జీవితంలో నటిగా నిర్మాతగా గర్వించదగ్గ పాత్రలతో పాటు సినిమాలు నిర్మించిన ఘనత ఆమె సొంతం.

సినీరంగంలో సావిత్రి తర్వాత అంతటి కీర్తి గడించిన నటి సౌందర్య మాత్రమే.ఆమె నటన కౌశలానికి మెచ్చి పద్మ శ్రీ.. జాతీయ ఉత్తమ నటి..నంది ఫిలింఫేర్ అవార్డులతో పాటు పలు పురస్కారాలు ఆమెను వరించాయి.
నటిగా పన్నెండేళ్ల సినీ ప్రస్థానంలో ఎన్నో ఎత్తుపల్లాలు చూసినా సౌందర్య కెరియర్ పిక్ స్టేజీలో ఉన్న తరుణంలో..2004 ఏప్రిల్ 17న ఎన్నికల ప్రచారంలో భాగంగా బెంగుళూరు నుంచి వరంగల్ వెళ్ళేక్రమంలో విమాన ప్రమాదంలో మరణించింది.భౌతికంగా లోకాన్ని విడిచి 18 ఏళ్లు కావొస్తున్నా ఆమె నటించిన పాత్రలు సజీవంగా కళ్ళముందు కదలాడుతున్నాయి.

Optimized by Optimole