కోటంరెడ్డి హ్యాట్రిక్ ఖాయం..!!

ఏపీలో నెల్లూరు రాజకీయం ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఇక్కడి నియోజకవర్గాల అభ్యర్థుల గెలుపు రాష్ట్ర రాజకీయాలను ప్రభావితం చేస్తుండటంతో.. అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీ జిల్లాపై పట్టుకోసం ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తూ వస్తున్నాయి.గత ఎన్నికల్లో వైసీపీ ఊహించని విధంగా జిల్లాలో క్లీన్ స్వీప్ చేసింది. దీంతో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపు కోసం ప్రధాన పార్టీలు వ్యూహాలకు పదునుపెడుతున్నాయి.ఈనేపథ్యంలోనే పీపుల్స్‌ పల్స్‌ రీసెర్చ్‌ సంస్థ నెల్లూరు రూరల్‌ నియోజకవర్గంలో చర్చించుకుంటున్నట్లు సర్వేలో వెల్లడైంది. ప్రస్తుత ఎమ్యెల్యే పనితీరూ.. వైసీపీ ప్రభుత్వ పాలన తీరుతెన్నులు..సంక్షేమ  పథకాలపై ప్రజలు..లబ్ధిదారులు స్పందన ఏంటి? వంటి విషయాలను పరిగణలోకి తీసుకుని సర్వే నిర్వహించగా సంచలన విషయాలు వెలుగులోకి వచ్చినట్లు వినిపిస్తోంది.


ఎమ్యెల్యే కోటంరెడ్డిపై ప్రజా స్పందన…
నెల్లూరు రూరల్‌ పరిధిలో తాజా రాజకీయ పరిస్థితి ఏంటన్న విషయంపై పీపుల్స్‌ పల్స్‌ సంస్థ ప్రతినిధులు విస్తృతంగా పర్యటించి ప్రజానాడీ తెలుసుకునే ప్రయత్నం చేశారని సమాచారం. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే ఎమ్యెలే శ్రీధర్‌ రెడ్డి గెలుపును ఎవరూ ఆపలేరన్నది స్పష్టంగా కనిపిస్తున్నట్లు చెబుతున్నారు. ఇందుకు ముఖ్య కారణం..ఎమ్యెల్యే ఏళ్లవేళలా ప్రజలకు అందుబాటులో ఉండటం..ఆపదలో ఉన్నామంటే చాలు వ్యక్తిగతంగా ఆర్థిక సాయం చేసి భరోసా కల్పించడం..ఎక్కడ గుడి,చర్చి, మసీదు లాంటివి కట్టుకున్నా తనవంతు సాయం చేస్తాడని నియోజకవర్గంలో చర్చించుకుంటున్నట్లు తెలిసింది.అంతేకాక పార్టీ నేతల మధ్య ఎటువంటి విభేదాలు తలెత్తకుండాసామరస్య ధోరణితో పార్టీని నడిపిస్తున్న తీరు.. ఆయనకు కలిసొచ్చే అంశాలలో ప్రధానమైనదిగా సర్వేలో తేలింది.

వైసీపీ ప్రభుత్వంపై అలా..ఎమ్యెలే పట్ల ఇలా..
నియోజకవర్గం పరిధిలో ఎవరిని కదిలించినా.. రాష్ట్రంలోని వైసీపీ ప్రభుత్వం..ముఖ్యమంత్రి జగన్ పట్ల తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేసినట్లు సర్వేలో తేలింది. అయితే ఇందుకు విరుద్ధంగా నెల్లూరు రూరల్ ఎమ్యెల్యే కోటంరెడ్డి పట్ల ప్రజలు సానుకూలంగా ఉన్నట్లు.. వరుసగా రెండు సార్లు ఎమ్యెల్యేగా గెలిచిన..ఇప్పటీకి ఆయనపై ప్రజల్లో విశ్వాసం ఏమాత్రం తగ్గలేదని సర్వేలో తేలినట్లు తెలిసింది.  ప్రతిపక్ష టీడీపీలోని ముఖ్య నాయకులను.. తమ పార్టీలో తీసుకురావడంతో టీడీపీ స్థానికంగా ఇబ్బందులు పడుతోంది. రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత ఉన్నా.. ఆప్రభావం తనపై పడకుండా కోటం రెడ్డి అన్ని జాగ్రత్తలు తీసుకుని..24 గంటలు ప్రజలతో మమేకమవుతున్నారు.

మొత్తం మీద పీపుల్స్ పల్స్ సంస్థ నిర్వహించిన సర్వే ప్రకారం నియోజకవర్గంలో   నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డికి ఉన్న వ్యక్తిగత ఇమేజ్ తో ఖచ్చితంగా హ్యాట్రిక్ కొట్టడం ఖాయంగా చెప్పవచ్చు.

Related Articles

Latest Articles

Optimized by Optimole