పార్థ సారథి పొట్లూరి: AR రెహమాన్ ఆస్కార్ అవార్డ్ గురించి చేసిన వ్యాఖ్యని వక్రీకరించి ఎవరికి ఇష్టం వచ్చిన వ్యాఖ్యలు వాళ్ళు చేస్తున్నారు!
గత జనవరి నెలలో రెహమాన్ ఆస్కార్ అవార్డ్ కోసం మన దేశం నుండి అధికారికంగా ఎంపిక చేసిన సినిమాల గురుంచి మాట్లాడుతూ ఏ సినిమాని పడితే ఆ సినిమాని ఆస్కార్ అవార్డ్ కోసం పంపిస్తున్నారు అన్నాడు!
రెహమాన్ ఉద్దేశ్యం మన దేశం నుండి అధికారిక ఎంట్రీ గా RRR ఉండాల్సింది అని అర్ధం వచ్చేట్లుగా మాట్లాడాడు ! రెహమాన్ తో పాటు ప్రముఖ వయొలిన్ విద్వాంసుడు L. సుబ్రహ్యమణ్యం కూడా ఉన్నారు !
ఆస్కార్ అవార్డ్ ఎంపిక కోసం మొత్తం 7 వేలమంది వోట్లు వేశారు ప్రపంచ వ్యాప్తంగా ! ఈ 7 వేల మందిలో రెహమాన్ కూడా ఉన్నాడు అలాగే RRR వోరీజినల్ సాంగ్ కి వోటు కూడా వేశాడు. మరో తమిళ నటుడు సూర్య కూడా అనుకూలంగా వోటు వేశాడు. అలాగే మన దేశంలో ఉన్న ప్రముఖ కళాకారులు కూడా ఓటింగ్ లో పాల్గొన్నారు.
వెస్ట్రన్ దేశాల అవార్డ్ కోసం మన దేశం నుండి చిత్రాన్ని పంపేటప్పుడు వాళ్ళ దృష్టి కోణం లో చూస్తూ పంపించాలి కానీ మరీ క్లాసిక్ సినిమాలు కాదు అని అన్నాడు ! అలా చేయబట్టే మన దేశం నుండి అధికారికంగా వెళ్ళిన ఏ సినిమా కి కూడా ఆస్కార్ అవార్డ్ రాలేదు.
స్పీల్ బర్గ్, జేమ్స్ కామెరాన్ లాంటి దర్శకులు RRR సినిమాని ఆస్కార్ అవార్డ్ కి పంపించక ముందే చూసి దర్శకుడు రాజమౌళి తో మాట్లాడి అభినందించారు ! కనీసమ్ అది చూశాన్నా మన దేశ సెలెక్షన్ కమిటీ RRR ని ఎంపిక చేసి ఉండాల్సింది !
హాలీవుడ్ టాప్ యాక్టర్ టామ్ క్రూజ్ కూడా చూసి నేను చాలా ఆశ్చర్యపోయాను ఇలా తీయగలిగే దర్శకులు ఇండియా లో ఉన్నారా అంటూ !
So ! రెహమాన్ అన్నది నూటికి నూరు పాళ్ళు కరెక్ట్ ! వాళ్ళ దృష్టితో చూసి అవార్డ్ కోసం పంపించాలి కానీ మన దృష్టితో కాదు !
జైహింద్ !