కేసీఆర్ హామీలపై బీజేపీ ‘ఝూఠా మాటల పోస్టర్ల’ అస్త్రం.. రెచ్చిపోతున్న నెటిజన్స్..!!

సీఎం కేసిఆర్ పై తెలంగాణ బీజేపీ మరో అస్రాన్ని సంధించింది. వివిధ సభల్లో సందర్భానుసారం కేసిఆర్ ఇచ్చిన హామీలు.. వాటిని అమలు చేయకపోవడాన్ని ఎండగడుతూ బిజెపి రాష్ట్రశాఖ ‘‘కేసీఆర్‌ ఝూఠా మాటలు’’ పోస్టర్లను రూపొందించింది. బీజేపీ స్టేట్ చీఫ్ బండి సంజయ్ ఈ పోస్టర్లను మంగళవారం విడుదల చేశారు. కేసీఆర్‌ ఝూఠా మాటలు పోస్టర్లను సోషల్‌ మీడియాలో విస్తృతంగా ప్రచారం చేయాలని బిజెపి శ్రేణులను ఆయన కోరారు.

ఇక ‘‘కేసీఆర్‌ ఝూఠా మాటలు’’ పోస్టర్లనూ పరిశీలించినట్లయితే.. ” దళిత నాయకుడిని ముఖ్యమంత్రిని చేసి తీరుతా.. మాట ఇచ్చా అంటే తల నరుక్కుంటా గానీ, ఆ మాట తప్పను. ఖచ్చితంగా, ఎట్టిపరిస్థితుల్లో రేపటి తెలంగాణ రాష్ట్రానికి దళిత నాయకుడే ముఖ్యమంత్రిగా ఉంటారన్నది ఓ పోస్టర్ సారాంశం.

పోస్టర్లపై నెటిజన్స్ రియాక్షన్ మాములుగా లేదు..

మరో పోస్టర్లో ..దళితులకు మూడెకరాల భూమి ఇస్తా …ఇంకో పోస్టర్లో..125 అడుగుల ఎత్తుతో అంబేద్కర్‌ విగ్రహాన్ని నిర్మిస్తా … ప్రతీ మండలంలో అంబేద్కర్‌ వికాస కేంద్రాలను ఏర్పాటు చేస్తాం…అంటూ వివిధ సభల్లో కేసిఆర్ హామీలను పోస్టర్లు రూపంలో ఎత్తి చూపిన విధానం పై పలువురు నెటిజన్స్ హర్షం వ్యక్తం చేస్తుండగా.. మరి కొందరు జనాలు సీఎం కేసిఆర్ జుటా మాటలు నమ్మే స్థితిలో లేరు అంటూ విమర్శిస్తున్నారు.

కాగా ఉప ఎన్నిక నేపథ్యంలో తెలంగాణ రాజకీయమంత మునుగుడు కేంద్రంగా నడుస్తున్న నేపథ్యంలో.. గతంలో కేసిఆర్ ఇచ్చిన హామీలను నెటిజన్స్ ప్రధానంగా ప్రస్తావించారు. ” ప్రతీ లంబాడీ తాండాలో, ప్రతీ గోండు గూడెంలో, ఊరికి దూరంగా ఉండే బస్తీల్లో, ప్రతీ ఇంటికి ప్రభుత్వఖర్చుతో నల్లా పెట్టించి, మంచినీళ్ల తెచ్చి.. ఆ మంచి నీళ్లతోనే మీ పాదాలు కడుగుతా, కడిగినంకనే ఓట్లు అడుగుతాని కేసిఆర్ అంటున్న పోస్టర్ పై నెటిజన్స్ భిన్నంగా కామెంట్స్ చేస్తున్నారు. ఇక మునుగోడు లో కేసిఆర్ అండ్ కో కు ఓట్లు అడిగే నైతిక హక్కు లేదంటూ ఒక్కరూ.. మునుగోడు లో కారు పార్టీ టక్కర్ కావడం ఖాయమంటు మరోకరు విమర్శిస్తూ కామెంట్ జోడించారు.

Optimized by Optimole