×

దీపావళి పర్వదినాన్ని పురస్కరించుకుని మునుగోడు ఉప ఎన్నిక ప్రచారం సందర్భంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు ఎంపీ బండి సంజయ్ కుమార్  వినూత్న రీతిలో ప్రచారం చేశారు.  చౌటుప్పల్  పట్టణంలో ఇంటింటికీ తిరుగుతూ బీజేపీకి ఓటేయాలంటూ స్వయంగా కమలం పూలు అందజేసి ఓటర్లను అభ్యర్థించారు.నియోజక వర్గ అభివృద్ధి కోసం రాజీనామా చేసిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించి..సీఎం కేసిఆర్ కు గుణపాఠం చెప్పాలని చౌటుప్పల్ లోని వీధుల్లో తిరిగారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్, పార్టీ రాష్ట్ర ఉఫాధ్యక్షులు డాక్టర్ గంగిడి మనోహర్ రెడ్డిలు పాల్గొన్నారు. 

కాగా చౌటుప్పల్ మండలంలో బీజేపీ నేతల ప్రచారంతో  పార్టీ నేతల్లో జోష్  నెలకొంది. ఎక్కడ చూసినా నేతలు కమలం పూలు చేతబట్టి ఎన్నికల ప్రచారం చేయడం కన్పించింది. భారీ ఎత్తున బండి సంజయ్ వెంట పార్టీ కార్యకర్తలు నడుస్తూ  ఎన్నికల ప్రచారంలో పాల్గొనడం చూసి ఓటర్లు ఆశ్చర్య వ్యక్తం చేస్తున్నారు.

మరోవైపు మునుగోడు నియోజకవర్గ వ్యాప్తంగా దీపావళి రోజున బీజేపీ అగ్ర నేతలంతా  కమలం పూలు చేతబట్టి ఎన్నికల ప్రచారం నిర్వహించడం రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీసింది. ఎన్నికల స్ట్రాటజీ కి పెట్టింది పేరైన కమలం పార్టీ వ్యూహాలను చూసి కంగుతినడం ప్రతి పక్ష నేతల వంతైంది. కాగా ఈ ప్రచారంలో కేంద్ర మంత్రి జి.కిషన్ రెడ్డి, బీజేపీ అభ్యర్ధి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, ఎన్నికల స్టీరింగ్ కమిటీ ఇంఛార్జ్ జి.వివేక్ వెంకటస్వామిసహా పలువురు బీజేపీ ముఖ్య నేతలు  కమలం పూలు చేత బట్టి ప్రచారం నిర్వచించడం కోసం మెరుపు. 

Author

dhoni.raju219@gmail.com

Related Posts

dilip reddy

journalism: సత్యాన్వేషణలో 37ఏళ్లు…!

Journalism: జర్నలిజం అంటే కేవలం వృత్తి కాదు… అది ఒక బాధ్యత. ప్రజల తరఫున నిజాన్ని వెలికి తీయడం, అధికారాన్ని ప్రశ్నించడం, సమాజానికి దిశా నిర్దేశం చేయడం ఇవన్నీ కలగలిపిన...

Read out all

Telangana: ఇందిరమ్మ క్యాంటీన్లపై పీపుల్స్ పల్స్ నివేదిక…

Telangana: భూమ్మీద ‘పేదరికం’ ఏ రూపంలో ఉన్నా నిర్మూలించాలని, ‘ఆకలి’ అనే శబ్దానికి తావులేని ప్రపంచం ఏర్పడాలని ఐక్యరాజ్యసమితి (యూఎన్) కోరింది. కీలకమైన ఈ రెండంశాలనే ఒకటి, రెండుగా పేర్కొంటూ...

Read out all

Telangana: విద్య, వైద్యంతోనే వికాసం…!!

Telangana: తెలంగాణ బడ్జెట్ ప్రతిపాదనల్లో విద్యకు ప్రాధాన్యతనిచ్చారు. ఇదే చొరవతో నిధుల కేటాయింపు కూడా జరిపి, అమలులో శ్రద్ద తీసుకుంటే రాష్ట్రంలో విద్యారంగం బాగుపడటానికి ఆస్కారం ఉంది. వైద్యరంగం మీద...

Read out all

HJDORA: వైవిధ్య కలపోత..!!

దిలీప్ రెడ్డి (సీనియర్ జర్నలిస్ట్): అది 1996 నవంబర్. అప్పటి CID చీఫ్ ఆఫీస్ డీజీపీ కార్యాలయ ప్రాంగణంలోనే, సుమారు ఇరవై అర్థచంద్రాకారపు మెట్ల పైన ఎంతో దర్జాగా, ఠీవీగా...

Read out all

Telangana: “తుపాకీ నుంచి ప్రజాస్వామ్యానికి?”

సిద్ధార్థ (జర్నలిస్ట్): ‘తుపాకీ గొట్టం ద్వారానే రాజ్యాధికారం సిద్ధిస్తుంది’ నా చిన్నతనంలో తెలంగాణలోని కొన్ని మారుమూల పల్లెల్లో గోడలపై వాల్ రైటింగ్స్ కనిపించేవి. విద్యార్థిగా ఉన్నప్పుడు పుస్తకాల్లో కొన్ని పేజీలపైనా...

Read out all

Telangana: కులం చిదిమేసింది..!!

రాహుల్ కశ్యప్: నవమాసాలు మోసి ఎన్నో ఆశలతో బిడ్డ కోసం ప్రసవ వేదనను పంటికింద నొక్కిపట్టి భరించిన కష్టం విలువ తెలియని నీచ రాజకీయుల కులగజ్జికి స్వస్థి పలకాల్సిందే..! ఓట్లడిగే...

Read out all
Optimized by Optimole