భీమ్లా నాయక్ విడుదల తేదీ ఖరారు..!

పవర్ స్టార్ అభిమానులకు గుడ్ న్యూస్. ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ‘భీమ్లా నాయక్’ మూవీని ఈనెల 25వ తేదీన విడుదల చేస్తున్నట్లు నిర్మాత నాగ వంశీ ట్విట్టర్ వేదికగా ప్రకటించారు. రెండు రాష్ట్రాల్లో కోవిడ్ ఉధృతి తగ్గడంతో చిత్రబృందం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
కాగా ఇప్పటికే విడుదలైన మూవీ టీజర్‌, గ్లింప్స్ ఆకట్టుకున్నాయి.దీంతో సినిమాపై అంచనాలు భారీగా పెరిగిపోయాయి. సినిమా కోసం అభిమానులు ఈగర్‌గా వెయిట్‌ చేస్తున్నారు.
ఇక మలయాళ హిట్ ‘అయ్యప్పనుమ్ కోశియుమ్’కు రీమేక్​గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో పవన్​ సరసన నిత్యామేనన్, సంయుక్త మేనన్​ హీరోయిన్లుగా చేస్తున్నారు.ఇందులో పవన్ పవర్ ఫుల్ పోలీస్​ పాత్రలో నటిస్తున్నారు. అతడిని ఢీ కొట్టే ప్రతినాయకుని పాత్రలో రానా కనిపించనున్నారు.సూర్యదేవర నాగ వంశీ నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ చిత్రానికి..సాగర్ చంద్ర దర్శకత్వం వహించగా త్రివిక్రమ్ మాటలు రాశారు. తమన్ సంగీతమందిస్తున్నారు.

Optimized by Optimole