Bigg Boss Telugu 6:  ఊహించని ట్విస్ట్.. గీతూ రాయల్ ఎలిమినేట్..!

Bigg Boss Telugu 6: ఊహించని ట్విస్ట్.. గీతూ రాయల్ ఎలిమినేట్..!

sambashiva rao :

==========

బిగ్ బాస్ తెలుగు సీజన్ 6 ఈ వారం ఊహించని ట్విస్ట్ ఎదురైంది. గీతూ రాయల్ మొదటి నుంచి టాప్ 5 నిలుస్తుందని అంతా భావించారు. ఊహించిన విధంగా ఈ వారం గీతు ఎలిమినేట్ అయినట్లు తెలుస్తుంది. దీంతో గీతక్క కథ ముగిసింది. గత వారంలో హౌస్ నుంచి ఎలిమినేషన్‌కు నామినేట్ వారిలో ఆది రెడ్డి, బాల ఆదిత్య, ఫైమా, గీతూ రాయల్, ఇనాయ, కీర్తి, మెరీనా, రేవంత్, రోహిత్ , శ్రీ సత్య ఉన్నారు.

అయితే మేకర్స్ ఈ వారం డబుల్ ఎలిమినేషన్ ప్లాన్ చేశారని.. అంతే కాదు ఒక కంటెస్టెంట్‌ని సీక్రెట్ రూమ్‌కి పంపుతారని ఊహాగానాలు కూడా వినిపించాయి. శ్రీ సత్య, మెరీనాలలో ఒకరు ఇంటి నుంచి బయటకు వెళ్ళే అవకాశం ఎక్కువగా ఉంది వార్తలు వచ్చాయి. సోషల్ మీడియాలో ఈవారం శ్రీ సత్య, ఫైమా, మెరీనా డేంజర్ జోన్‌లో ఉంటారని భావించారు. అయితే అనూహ్యంగా గీతుని బయటకు పంపించారు నిర్వాహకులు.

మొదటి నుంచి బిగ్ బాస్ రూల్స్ తనాకేమీ వర్తించవు అన్నట్లు అడింది గీతు. బిగ్ బాస్ ఇచ్చిన ఏ టాస్క్ లోనూ గీతు సరైన ఆట కనబర్చాలేదు. తన అతి తెలివతేటలతో ఇంటి సభ్యులతో ఆటలాడింది. ఇక మిషన్ ఇంపాజిబుల్ టాస్క్ లో.. బాలఆదిత్యతో ప్రవర్త ప్రేక్షకులకు చిరాకు తెప్పించింది. చనిపోయిన వాళ్ళు భౌతికంగా ఆట ఆడకుడదని బిగ్ బాస్ చెప్పిన గీతూ వినలేదు. ఇక రాత్రి గేమ్ నిలిచిన సమయంలో ఆదిరెడ్డి స్ట్రిప్స్ తీసి ఔట్ అయ్యేలా చేసింది. వాళ్ళ టీమ్ ఓటమికి కారణమైంది.

లైటర్‌ కోసం గీతూ, బాలాఆదిత్య మధ్య జరిగి ఫైట్ ఒక్కసారిగా షో రేటింగ్ పెరగటానికి కారణమైంది. ఈ వారం గీతూ ప్రవర్తన వీక్షకులకి విరక్తి కలిగించింది.

ఏ టాస్క్ లోనూ సరెనా ఆటతీరు కనబరచకపోవడంతో గీతూ షో నుంచి ఎగ్జిట్ అయింది. ఇప్పటికే షాని, అభినయ, నేహా, ఆరోహి, చంటి, సుదీప, అర్జున్ , సూర్య ఇప్పటివరకు ఎలిమినేట్ అయిన సంగతి తెలిసిందే.