బిగ్‌బాస్ తెలుగు ఐదో సీజన్ విన్నర్ ఎవరన్న ఉత్కంఠకు తెరపడింది. అభిమానుల హృదయాలను గెలిచి.. అత్యధిక ఓట్లతో సన్నీ విజేతగా నిలిచాడు. 105 రోజుల పాటు సాగిన బిగ్‌బాస్-5లో మొత్తం 19మంది కంటెస్టెంట్‌లు పాల్గొనగా.. తనదైన ఆట తీరుతో మెప్పించి, ఎంటర్‌టైనర్‌గా ప్రేక్షకుల హృదయాలను గెలచుకున్నాడు సన్నీ. ఆద్యంతం ఉత్కంఠగా సాగిన ఫినాలేలో మొదట సిరి, మానస్, శ్రీరామచంద్ర ఎలిమినేట్ అవ్వగా.. చివరికు సన్నీ, షణ్ముఖ్ నిలిచారు. చివరి వరకూ ఉత్కంఠగా సాగిన కౌంట్‌డౌన్‌లో ప్రేక్షకుల హృదయాలను గెలుచుకుని అత్యధిక ఓట్లు సంపాదించిన వీజే సన్నీ విజేతగా నిలిచినట్లు ప్రకటించారు.
ఇక విజేతగా నిలిచిన సన్నీకి కింగ్ నాగార్జున బిగ్‌బాస్ ట్రోఫీని బహుకరించాడు. అంతేకాక 50 లక్షల చెక్‌ను అందజేశాడు. దీనితో పాటు సువర్ణ భూమి ఇన్‌ఫ్రాస్టక్చర్ నుంచి షాద్‌నగర్‌లో 25 లక్షల విలువ చేసే 300 చదరపు గజాల భూమిని విన్నర్ సన్నీ సొంతం చేసుకున్నట్లు ప్రకటించాడు. టీవీఎస్ బైక్ కూడా గెలుచుకున్నాడని నాగార్జున అన్నారు.
కాగా బిగ్ బాస్ విన్నర్ సన్నీకి అభిమానులు ఘనస్వాగతం పలికారు. హౌస్ నుంచి బయటిరాగానే అతనిపై పూల వర్షం కురిపించారు. అనంతరం అతని ఇంటి వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. స్లోగన్స్తో దారిపోడవున నానాహంగామా చేశారు. ఈనేపథ్యంలోనే ర్యాలీలో స్వల్ప ఉద్రిక్తత చోటు చేసుకుంది. పోలీసులు జోక్యంతో ర్యాలీని ప్రశాంతంగా ముగిసింది.
అటు పోటీపై బిగ్ బాస్ రన్నరప్ షణ్ముఖ్ స్పందించాడు. ఆట గెలిచామా? లేదా అన్నది కాదు.. ఎలా ఆడామన్నది ముఖ్యం అంటూ తనదైన శైలిలో చెప్పుకొచ్చాడు షణ్ముఖ్. ఇప్పుడు కాకపోతే తర్వాతైనా గెలవచ్చాన్నాడు. అమ్మానాన్నను ఇక్కడి వరకు తీసుకొచ్చాను. చాలా సంతోషంగా ఉందన్నాడు. మరో ఇంట్రస్టింగ్ విషయం ఏంటంటే.. విన్నర్‌కు ప్లాట్ ఇచ్చిన సువర్ణ కుటీర్ డెవలపర్స్ రన్నరప్ షణ్నుకు కూడా ఎంతో కొంత ప్లాట్ ఇస్తామని ప్రకటించింది.