ప్రపంచ కుబేరుడు మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ మరోసారి దాతృత్వం చాటుకున్నాడు. తన సంపాదనలో 20 బిలియన్ డాలర్లు ( సుమారు లక్షన్నర కోట్లు) మిలిందా గేట్స్ సంస్థకు అందజేయనున్నట్లు ప్రకటించాడు. ఈవిషయాన్ని తన వ్యక్తి గత బ్లాగ్ లో వెల్లడించారు. సంస్థ కార్యకలాపాలను విస్తరించేందుకు ఈనిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ప్రపంచ సంపన్నుల జాబితా నుంచి త్వరలోనే బయటకు వస్తానని ఆయన వెల్లడించారు.
Although the foundation bears our names, basically half our resources have come from Warren Buffett. His incredible generosity is a huge reason why the foundation has been able to be so ambitious. I can never adequately express how much I appreciate his friendship and guidance. pic.twitter.com/at7MvJKxQv
— Bill Gates (@BillGates) July 13, 2022
ఇక బిల్ గేట్స్ బ్లాగ్ లో ఇలా రాసుకున్నారు. కుటుంబానకి ఖర్చు మినహా సంపాదనంత ఫౌండేషన్ కి ఇవ్వాలనదే తపనతో 20 బిలియన్ డాలర్లు అందజేస్తున్నట్లు చెప్పుకొచ్చారు. ఇది త్యాగంతో చేసిన పనికాదని .. ఉపకారంతో చేసిన పనిగా భావిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. 70 బిలియన్ డాలర్ల ఫౌండేషన్.. రెండు దశాబ్దాల క్రితం ఒక డాలర్ తో మొదలై.. నేడు ప్రతి ఏటా 6 బిలియన్ డాలర్లు ఖర్చు చేసే స్థాయికి చేరిందన్నారు.
కరోనా మహమ్మారి సమయంలో 2 ఫౌండేషన్ రెండు బిలియన్ డాలర్లు ఖర్చు చేసినట్లు బిల్ గేట్స్ తెలిపారు. 2026 నాటికి 9 బిలియన్లకు పెంచాలని లక్ష్యం పెట్టుకున్నామని.. ఇప్పుడే యాడ్ అయ్యే 20 బిలియన్ డాలర్లతో గేట్స్ ఫౌండేషన్ విరాళాల విలువను 70 బిలియన్ డాలర్లకు పెంచాలని నిర్ణయించినట్లు స్పష్టం చేశారు.
బ్లూమ్‌బర్గ్ బిలియనీర్ ఇండెక్స్ ప్రకారం..113 బిలియన్ డాలర్లతో.. ప్రపంచంలో నాలుగో సంపన్న వ్యక్తిగా బిల్‌గేట్స్ కొనసాగుతున్నారు. అతని కంటే ముందు 217 బిలియన్ డాలర్ల సంపదతో టెస్లా అధినేత ఎలాన్ మస్క్ తొలిస్థానంలో..అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్ 134.. బెర్నార్డ్ జీన్ ఆర్నాల్ట్ 127 బిలియన్ డాలర్లతో రెండు, మూడు స్థానాల్లో ఉన్నారు.