సందేశంతో కూడి ఎమోషనల్ మూవీ.. గార్గి రివ్యూ!

అందం.. అభినయం.. డ్యాన్స్.. మల్టీటాలెంట్ తో ప్రేక్షకుల అభిమానాన్ని చూరగొన్న కథానాయిక సాయిపల్లవి. విభిన్న కథలకు కేరాఫ్ అడ్రస్ నిలిచిన..ఈభామ తాజాగా నటించిన చిత్రం గార్గి. శుక్రవారం ప్రేక్షుకుల ముందుకు వచ్చిన మూవీ ప్రేక్షుకులను మెప్పించిందా లేదా చూద్దాం!

కథేంటంటే..
ఈ సినిమా యథార్ధ సంఘంటన ఆధారంగా రూపొందింది. ఓ నిరుపేద కుటుంబంలో పుట్టిన గార్గి(సాయిపల్లవి) టీచర్ గా పనిచేస్తుంటుంది. తండ్రి సెక్యూరిటీ గార్డ్. ఈక్రమంలో గార్గికి పెళ్లి చేయాలని కుటుంబ సభ్యులు భావిస్తారు. అనుకోకుండా ఓ బాలిక హత్యాచారం కేసులో ఆమె తండ్రిని పోలీసులు అరెస్ట్ చేసి రహస్య ప్రదేశంలో ఉంచుతారు. దాంతో తండ్రి ఆచూకీ కోసం గార్గి పరితపిస్తూ ఉంటుంది. పోలీసులు తండ్రిని కలవనివ్వకపోవడంతో.. న్యాయ పోరాటానికి దిగుతుంది.ఈపోరాటంలో ఆమెకు అనేక అవాంతారాలు ఎదురవుతాయి. ఇంతకు గార్గి తండ్రిని పోలీసులు ఎందుకు అరెస్ట్ చేశారు? న్యాయపోరాటంలో ఆమె గెలిచిందా? లేదా అన్నది తెలియాలంటే చిత్రం చూడాల్సిందే!

వాస్తవిక కథ ఆధారంగా ఈ సినిమాని తెరకెక్కించారు దర్శకుడు రాంచంద్రనన్. కథకు తగ్గట్టు కథానాయికగా సాయిపల్లవిని ఎంచుకుని ఫస్ట్ సక్సెస్ సాధించారు. అయితే సినిమాను ఆసక్తికరంగా మలచడంలో మాత్రం ప్రేక్షకుల అంచనాలను అందుకోలేకపోయాడు. సెకండాఫ్ లో వచ్చే సన్నివేశాలు ..క్లైమాక్స్ సన్నివేశాలు ప్రేక్షకులను కట్టిపడేస్తాయి. న్యాయం కోసం పోరాడే యువతిగా సాయిపల్లవి నటన సినిమాకే హైలెట్. ఆమె పలికించిన హావాభావాలు, సంభాషణలు ఆకట్టుకున్నాయి. మెసెజ్ తో కూడిన క్లైమాక్స్ ట్విస్ట్.. ప్రతి ఒక్కరిని ఆశ్చర్యానికి గురిచేస్తుంది. సంగీతం పరంగా ఓకే అనిపిస్తుంది. సినిమాటోగ్రఫీ సినిమాకే హైలెట్ గా చెప్పవచ్చు. నిర్మాణ విలువలు బాగున్నాయి.

ఒక్కమాటలో చెప్పాలంటే మంచి సందేశంతో కూడిన ఎమోషనల్ మూవీ చూశానన్న భావన కలుగుతుంది.