తెలంగాణపై డెంగీ పంజా.. అప్రమత్తంగా ఉండాలన్న వైద్య శాఖ!

dengue

 

తెలంగాణలో సీజనల్ వ్యాధులు ప్రబలుతున్నాయి. ఓవైపు ఎడతెరపిలేని వర్షాలు.. మరో వైపు సీజనల్ వ్యాధులతో ప్రజలు అల్లాడిపోతున్నారు. ముఖ్యంగా రాష్ట్రంలో డెంగీ బారిన పడుతున్న వారి సంఖ్య రోజురోజుకూ పెరిగిపోతోంది. ఇదే అదనుగా కొన్ని ప్రైవేట్ ఆసుపత్రులు చికిత్స పేరిట డబ్బులు దండుకుంటున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఈవిషయంపై వైద్య ఆరోగ్య శాఖ దృష్టి సారించింది.

రాష్ట్రంలో ఇప్పటివరకు 1,300 డెంగీ కేసులు నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. అందులో అత్యధికంగా హైదరాబాద్‌లో 600 కేసులు రాగా.. ఒక్క జూన్‌ నెలలోనే 565.. జులై తొలి రెండు వారాల్లో 300కి పైగా కేసులు నమోదయ్యాయి. అధికారిక లెక్కలు ఉంటే.. అనధికార లెక్కలు సంఖ్య రెట్టింపు ఉంటుందని నిపుణులు అంచనావేస్తున్నారు.

ఇక జూలైలోనే పరిస్థితి ఇలా ఉందంటే ఆగస్టు, సెప్టెంబర్ లో వర్షాలు అధిక వర్షాలు కురిసేందుకు అస్కారం ఉంటుంది. దీంతో సీజనల్ వ్యాధులతో పాటు స్పైన్ ఫ్లూ ప్రమాదం పొంచి ఉంది. వీటికి తోడు.. కరోనా ఉధృతి ఎక్కువైతే ప్రజారోగ్యం అతలాకుతలం అయ్యే అవకాశం ఉన్నట్లు అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.