మూడు సార్లు పెళ్లి చేసుకుందాామనుకున్నా..దేవుడు రక్షించాడు: సుస్మితా సేన్

బాలీవుడ్ నటి సుస్మితా సేన్ పెళ్లి గురించి ఇంట్రస్టింగ్ కామెంట్స్ చేసింది. జీవితంలో కొంతమంది వ్యక్తులు మనసుకు దగ్గరగా అనిపించారు. వారితో బంధం పెళ్లి పీటల వరకూ వెళ్లింది. అదృష్టవశాత్తూ దేవుడి దయవల్ల పెళ్లి నుంచి తప్పించుకున్నాను అంటూ సుస్మిత సేన్ చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్ గా మారాయి. ట్వీక్ ఇండియా ది ఐకాన్స్ ప్రోగ్రాంలో భాగంగా ట్వింకిల్ ఖన్నా అడిగిన ప్రశ్నలకు సుస్మితా సమాధానమిస్తూ.. అదృష్టవశాత్తూ జీవితంలో ఇంట్రెస్టింగ్ వ్యక్తులను కలుసుకున్నాను.. నేను పెళ్లికి చేసుకోకపోవడంతో వారంతా నిరాశచెందారు. ఇది పూర్తిగా నా వ్యక్తిగత విషయం.. పెళ్లికి పిల్లలతో సంబంధం లేదంటూ సుస్మితా చెప్పుకొచ్చారు.

 

ప్రేమ విషయంలో ఎప్పడూ దాపరికంగా మసులుకోలేదని అన్నారు సుస్మితా. ప్రేమించిన వ్యక్తులను పిల్లలిద్దరూ మ నస్పూర్తిగా అంగీకరించారన్నారు. మూడు సార్లు పెళ్లి చేసుకుందామని అనుకున్నా.. దేవుడు దయవల్ల ఆగండం నుంచి బయటపడ్డాను అంటూ ఆమెచెప్పుకొచ్చారు. గత ఏడాది బాయ్ ఫ్రెండ్ రోహ్ మాన్ తో విడిపోతున్నట్లు ఆమె ఇన్ స్టా గ్రామ్ పోస్ట్ ద్వారా తెలియజేసింది.మేము విడిపోతున్నాం.. ఇక నుంచి స్నేహితులుగా ఉంటాం.. బంధం మాత్రమే ముగిసింది.. ప్రేమ మిగిలింది అంటూ #nomorespeculations అనే హ్యాష్‌ట్యాగ్‌లతో పోస్ట్‌ చేసింది మాజీ మిస్ యూనివర్స్.