ఏపీలో బ్రిటిష్ కంటే దరిద్రమైన పాలన :ఎంపీ రఘురామ
ఏపీ ప్రజలు స్వాతంత్ర సమరానికి మించిన పోరాటం చేయల్సిన అవసరముందన్నారు నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు.రాష్ట్రంలో బ్రిటిష్ వారి కంటే దరిద్రమైన పాలన సాగుతోందని దుయ్యబట్టారు.భారత రాజ్యాంగం ప్రజలకు భావ స్వేచ్ఛనిచ్చింది. సభలు సమావేశాలు నిర్వహించుకునే అవకాశాన్ని కల్పించిందన్నారు. రాష్ట్రంలో అతి దారుణమైన, క్రూరమైన ప్రభుత్వం అధికారంలోకి వచ్చి.. భావ ప్రకటన స్వేచ్ఛను హరించిందని రఘురామ మండిపడ్డారు. బ్రిటిష్ పోలీస్ చట్టం 1861లోని 30, 30A, 31 లలో పోలీసుల విధివిధానాలు, వాళ్ల పని తీరు గురించి చెబుతున్నాయని…