డిఫెండింగ్ ఛాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్ ఖాతాలో మరో విజయాన్ని నమోదు చేసింది. గురువారం జరిగిన ఉత్కంఠ పోరులో చెన్నై జట్టు ముంబై పై గెలిచింది. మరోవైపు ఈ మ్యాచ్‌తోనైనా టోర్నీలో బోణీ కొట్టాలని భావించిన ముంబయికి చుక్కెదురైంది.
అంతకుముందు టాస్ ఓడి బ్యాటింగ్ దిగిన ముంబయి.. నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 155 పరుగులు చేసింది. ఆ జట్టులో
తిలక్ వర్మ (51) అర్ధశతకం మెరిశాడు. సూర్యకుమార్ యాదవ్ (32), హృతిక్ షోకీన్ (25) ఫర్వాలేదనిపించారు. చెన్నై బౌలర్లలో ముకేశ్ చౌదరి 3, డ్వేన్ బ్రావో 2.. మిచెల్ సాంట్నర్, తీక్షణ చెరో వికెట్ తీశారు.
అనంతరం 156 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన చెన్నై జట్టు.. అంబటి రాయుడు (40), రాబిన్ ఊతప్ప (30) బాధ్యతాయుత ఇన్నింగ్స్ కి తోడు..ఎంఎస్ ధోనీ (28*) ‘ఫినిషర్’ అవతారమెత్తడంతో చివరి బంతికి విజయం సాధించింది.