ఢిల్లీని చిత్తుచేసిన రాజస్ధాన్.. టేబుల్ టాప్ ప్లేస్!

ఐపీఎల్ టోర్నీలో రాజస్థాన్​ రాయల్స్​ జట్టు మరోసారి అదరగొట్టింది. శుక్రవారం ఢిల్లీ క్యాపిటల్స్ తో జరిగిన పోరులో రాజస్థాన్​ జట్టు అన్ని విభాగాల్లో ఆధిపత్యాన్ని ప్రదర్శించి విజయం సాధించింది. ఈ విజయంతో రాజస్థాన్‌ (10) పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి చేరుకుంది.
తొలుత టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ జట్టు.. ఓపెనర్లు బట్లర్ సెంచరీ.. పడిక్కల్ హాఫ్ సెంచరీతో చెలరేగడంతో 222 పరుగుల భారీ స్కోర్ సాధించింది. ఆ జట్టులో కెప్టెన్ సంజూ శాంసన్ (46) మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. దిల్లీ బౌలర్లలోశార్దూల్ ఠాకూర్‌ మూడు, అక్షర్‌ పటేల్ రెండు వికెట్లు తీయగా.. ముస్తఫిజర్ ఒక వికెట్ పడగొట్టారు.
అనంతరం 222 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఢిల్లీ జట్టు 207 పరుగులకే పరిమితమైంది. దీంతో రాజస్థాన్ జట్టు 15 పరుగులతో విజయం సాధించింది. దిల్లీ బ్యాటర్లలో రిషభ్‌ పంత్ (44) రాజస్థాన్‌ బౌలర్లలో ప్రసిధ్‌ 3, అశ్విన్ 2.. మెక్‌కాయ్‌, చాహల్ చెరో వికెట్ తీశారు.